అన్వేషించండి
Advertisement

Mahesh Babu: కొడుకుని చూసి గర్వపడుతున్న మహేష్ బాబు - గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే పిక్స్ వైరల్
Mahesh Babu - Gautam Ghattamaneni: సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల కుమారుడు గౌతమ్ తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను మహేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Image Credit: Mahesh Babu Instagram
1/7

మహేశ్ బాబు తనయుడు గౌతమ్ అమెరికన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఘట్టమనేని వారసుడు సక్సెస్ ఫుల్‌గా తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకున్నాడు.
2/7

గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్, సితార ఘట్టమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను మహేశ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
3/7

‘గర్వంతో నా హృదయం ఉప్పొంగుతోంది. గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు నీకు అభినందనలు. తర్వాతి అధ్యాయం ఎలా రాయాలనేది నీ చేతుల్లోనే ఉంది. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావని నాకు తెలుసు. నీ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం పరుగెడుతూనే ఉండు. గుర్తు పెట్టుకో నువ్వు ఎప్పటికీ నాకు ప్రియమైన వాడివే. ఒక తండ్రిగా ఈ రోజు నేను ఎంతో గర్వపడుతున్నా’ అని మహేష్ పేర్కొన్నారు.
4/7

‘మై డియర్ జీజీ. నువ్వు నీ జీవితంలోనే కొత్త చాప్టర్ ముందు నిలబడి ఉన్నావు. ఈరోజు నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. నీకు నువ్వు ఎప్పుడూ నిజాయితీగా ఉండు. నీ కలలను ఎప్పుడూ దూరం చేసుకోకు. మేము నిన్ను నమ్మినంతంగా నిన్ను నువ్వు నమ్ము. నీ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్లినా నా ప్రేమ, సపోర్ట్ ఎప్పటికీ ఉంటాయి. ఈ ప్రపంచం ఇంక నీదే. ఐ లవ్ యూ సో మచ్’ అని నమ్రత పేర్కొంది.
5/7

సోదరి సితార సైతం గౌతమ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
6/7

సూపర్ స్టార్ వారసుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా మహేశ్ ఫ్యాన్స్ విషెస్ అందజేస్తున్నారు.
7/7

గౌతమ్ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌లో మహేశ్ బాబు పొడవాటి జుట్టు, గడ్డంతో న్యూ లుక్ లో కనిపించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
Published at : 26 May 2024 11:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రైమ్
నిజామాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion