అన్వేషించండి

Hyderabad Metro Rail Corridor: ఎయిర్ పోర్ట్ నుంచి 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి... గ్రీన్ కారిడార్ లో మెట్రో ఎండీ క్షేత్ర స్థాయి పరిశీలన

Hyderabad Metro Rail | ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్ లను అభివృద్ధి చేసి, విమానాశ్రయం నుండి వేగంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Proposed Stations And Map Of Hyderabad Metro Rail Corridor | హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లతో పాటు నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇది కాలుష్యరహిత గ్రీన్ సిటీ గా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఏండీఏ, టీజీఐఐసీ లతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. 

కాలుష్యరహిత నగరంగా ఫ్యూచర్ సిటీ

ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్ లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వేగంగా, సులభంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అది వాస్తవరూపం దాల్చేందుకు కసరత్తు చేస్తున్నామని, దాదాపు పదిహేను వేల ఎకరాలలో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్యరహిత నగరంగా రూపొందించడంలో, దానికి  అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహిస్తుందని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుండి మీర్ ఖాన్ పేట్ లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారీకై జరుగుతున్న సర్వే పనులను మెట్రో ఎండీ ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించారు. కొంగర కలాన్ దాటిన తరువాత ప్రస్తుతం రోడ్ లేకపోవడం వల్ల కాలినడకన ఆయన ఈ క్షేత్ర పర్యటన జరిపారు. 


Hyderabad Metro Rail Corridor: ఎయిర్ పోర్ట్ నుంచి 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి... గ్రీన్ కారిడార్ లో మెట్రో ఎండీ క్షేత్ర స్థాయి పరిశీలన

ఎయిర్ పోర్ట్ నుండి రావిర్యాల మీదుగా గ్రీన్ కారిడార్ మెట్రో రైల్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుండి మొదలై, కొత్త మెట్రో రైల్ డిపో పక్క నుండి ఎయిర్ పోర్ట్ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్ పల్లి గుండా 5 కిలోమీటర్లు ముందుకు సాగాక  పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి చేరుతుందని మెట్రో ఎండీ తెలిపారు. బహదూర్ గుడాలో ఉన్న దాదాపు 1000 నుండి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్ గుడా, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని ఎన్వీఎస్  రెడ్డి వెల్లడించారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా ఓఆర్ఆర్ లో మెట్రో రైల్ కి కేటాయించిన భాగంలో తక్కువ ఎత్తులో నిర్మిస్తామని ఆయన తెలిపారు. 

రహదారికి ఇరువైపులా రెండు సర్వీస్ రోడ్లు

రావిర్యాల ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ ఖాన్ పేట్ వరకు హెచ్ఎండీఏ 100 మీటర్లు ( 328 అడుగులు) వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రో రైల్ కి కేటాయించారు. ఈ రోడ్ మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ 'ఎట్ గ్రేడ్' (భూ తలంపై) మెట్రోగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ రోడ్ మధ్య లో అదే లెవెల్ లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుంది. మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామని, ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తామనిఅన్నారు. 

 డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఓఆర్ఆర్ నిర్మిస్తున్నప్పుడు ఓఆర్ఆర్ లో అంతర్భాగంగా భవిష్యత్ లో నిర్మించబోయే మెట్రో కి తగినంత స్థలాన్ని కేటాయించాలన్న అప్పటి తన ప్రతిపాదనతో 20 మీటర్లు మెట్రోకి కేటాయించినట్లు తెలిపారు. ఓఆర్ఆర్, మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని, అప్పట్లో అనేక మంది అపహాస్యం చేసినా.. ఓఆర్ఆర్, మెట్రో రెండూ కూడా కార్యరూపం దాల్చాయన్నారు. వీటివల్ల హైద్రాబాద్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మెట్రో ఎండీ అన్నారు. 

Also Read: Revanth Reddy: యాదగిరిగుట్టలో బంగారు విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, పూర్తి విశేషాలివే

ప్రపంచంలో ప్రప్రథమంగా 22 వేల కోట్ల రూపాయలతో మెట్రో మొదటి దశను 69 కిలోమీటర్ల మేర పీపీపీ పద్ధతిన విజయవంతంగా పూర్తి చేసాం. అదే విధంగా ఈ ప్రణాళికలను కూడా రేవంత్ రెడ్డి దార్శనికతతో కార్యరూపం దాల్చేలా హెచ్ఎండీఏ, టీజీఐఐసి, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తాయని అన్నారు. నార్త్ సిటీ లోని మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లతో పాటు, ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ కూడా ఈ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi on Gujarat Riots: చిన్న నిప్పురవ్వ కూడా అశాంతికి దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
చిన్న నిప్పురవ్వ కూడా అశాంతికి దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
Samantha: ఆస్పత్రి బెడ్‌పై సమంత.? - అసలు ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ ఆందోళన!
ఆస్పత్రి బెడ్‌పై సమంత.? - అసలు ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ ఆందోళన!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi on Gujarat Riots: చిన్న నిప్పురవ్వ కూడా అశాంతికి దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
చిన్న నిప్పురవ్వ కూడా అశాంతికి దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
Samantha: ఆస్పత్రి బెడ్‌పై సమంత.? - అసలు ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ ఆందోళన!
ఆస్పత్రి బెడ్‌పై సమంత.? - అసలు ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ ఆందోళన!
SpaceX Crew 10 Mission Success: నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
Saira Banu: 'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
Revanth Reddy News: స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - వాటి పూర్తి వివరాలివే
స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - వాటి పూర్తి వివరాలివే
Pushpa 3 Movie: 'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
Embed widget