MS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP Desam
సాధారణంగా వయసు మీద పడేకొద్దీ కంటికి చేతికి మధ్య సమన్వయం కొరవడుతుంది. ఇది జనరల్‌గా వచ్చే ఏజ్ ఫ్యాక్టర్ అయినా క్రికెట్‌లో చాలా కీలకమైంది. ఐ కి హ్యాండ్ కి కోఆర్డినేషన్ తప్పిపోయి చాలామంది క్రికెటర్లు రిటైర్ కూడా అయిపోతారు. అలాంటిది కీపర్‌గా ధోని మాత్రం వయసు మీద పడుతున్న కొద్దీ మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. 43 సంవత్సరాల వయసులో IPL 18వ సీజన్ ఆడుతున్న ధోని మెరుపు స్టంపింగ్స్‌తో చెలరగిపోతున్నాడు. మొన్నటికి మొన్న ముంబై మీద తన స్కిల్స్ ని చూపించాడు. ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో కూడా అంతే త్వరగా రియాక్ట్ అయ్యాడు. సాల్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ధోని క్యాచ్ పట్టాలు. చాలా త్వరగా రియాక్ట్ అయ్యాడు. ఇంకొంచం టైం ఉంటె సాల్ట్ తన బ్యాటింగ్ కాలుని లైన్ పైన పేటెవాడేమో. కానీ ఆ లోపే ధోని బాల్ ని పిక్ చేసి చాలా కాన్ఫిడెంట్ గా ఎంపైర్ వైపు చూసాడు.





















