తెలంగాణ ప్రభుత్వం 50 రోజులపాటు సర్వే చేసి రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ఉందో లెక్కలు వెల్లడించింది

Published by: Shankar Dukanam

బీసీల జనాభా

రాష్ట్రంలో అధికంగా బీసీలున్నారు. బీసీల జనాభా 56.33 శాతం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు

ఎస్సీల జనాభా

తెలంగాణలో ఎస్సీల జనాభా 61,84,319 (రాష్ట్ర జనాభాలో 17.43 శాతం)

ఎస్టీల జనాభా

తెలంగాణలో ఎస్టీల జనాభా- 37,05,920 (రాష్ట్ర జనాభాలో 10.45 శాతం)

ముస్లిమేతర బీసీలు

బీసీలు (ముస్లింలు మినహా)- 1,64,09, 179 (46.25 శాతం)
బీసీలు (ముస్లింలలో)- 35,76,588 (10.08 శాతం)

ఓసీలలో ముస్లింలు

తెలంగాణలో ఓసీలు (ముస్లింలలో)- 8,80,424 (రాష్ట్ర జనాభాలో 2.48 శాతం)
ఓసీలు (ముస్లింలు మినహా)- 47, 21,115 (13.31 శాతం)

మొత్తం ముస్లింలు

ఓసీలు (ముస్లింలతో కలిపి)- 56,01, 539( 15.79 శాతం)
తెలంగాణలో మొత్తం ముస్లింలు- 44,57,012 (రాష్ట్ర జనాభాలో 12.56 శాతం)

ఎన్నికల హామీ మేరకు

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కుల గణన సర్వే చేపట్టి సర్వే ఫలితాలు విడుదల చేసింది.