MS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP Desam
16 ఏళ్ల తర్వాత ఆర్సీబి చెన్నైని సొంతగడ్డ చెన్నై చపాక్ స్టేడియంలోనే ఓడించే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ధోని ఎలాంటి రిస్కు తీసుకోలేదు. ముందు వెళ్తానంటే ధోనిని కాదనేవారే ఎవ్వరూ లేరు ఆ టీంలో కానీ ఎందుకో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా కాసేపు కుదురుకోవడానికి టైం తీసుకుని 19వ ఓవర్ లో హ్యాజిల్వుడ్ బౌలింగ్ లో రెండు ఫోర్లు. లాస్ట్ ఓవర్ లో కృనాల్ పాండ్యా బౌలింగ్ లో రెండు సిక్స్లు ఓ ఫోర్ కొట్టాడు మహి. మొత్తంగా 16 బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 187 ధోని స్టాట్స్ వరకు పిక్చర్ పర్ఫెక్ట్ కానీ సిఎస్కే మాత్రం 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 43 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్న ఓ ఆటగాడినే ఇంకా గెలిపించాలని ధోనీ అడగడం స్వార్థం కావచ్చు.





















