
నేను సీఎంగా ఉండగా సినిమా టికెట్ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై సుదీర్ఘంగా మాట్లాడారు. చట్ట ప్రకారమే అన్నీ జరిగాయని, అనవసరం ప్రతిపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయని మండి పడ్డారు. సినిమా వాళ్లకి ప్రత్యేక చట్టం అంటూ లేదని స్పష్టం చేశారు. తాను సీఎంగా ఉన్నన్నాళ్లు ఇకపై సినిమా వాళ్లు స్పెషల్ ప్రివిలేజ్ కోసం అడగొద్దని, అడిగినా ఇవ్వమని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని వెల్లడించారు. వాళ్లకు భరోసా కల్పించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఇంత జరిగినా కూడా మళ్లీ సినిమా వాళ్లు స్పెషల్ ప్రెవిలేజ్ కావాలని వస్తే అందుకు అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, కానీ..ఇలాంటి విషాదాలు జరిగితే మాత్రం సహించేది లేదని అన్నారు. సినీ పరిశ్రమకి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇదే సమయంలో తప్పుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోడానికి కూడా వెనకడాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

