Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
టీమిండియా గ్రేట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ని వీడి లక్నో సూపర్ జెయింట్స్ తో ఐపీఎల్లో ఆడటంపై స్పందించాడు. అంతకుముందు మెగా వేలానికి ముందు ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో అర్జున్ ని లక్నో తీసుకుంది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆయన లక్నో సూపర్ జెయింట్స్ గూటికి చేరాడు.
2021లో ముంబై ఇండియన్స్ నుంచి ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ ఆల్ రౌండర్, 2025 వరకు అదే ఫ్రాంచైజీలో కొనసాగాడు. అక్కడ అవకాశాలు తక్కువగా రావడంతో ఈ ఏడాది లక్నో టీమ్ ఆయన్ని సొంతం చేసుకుంది. కొత్త టీమ్ తరపున ఇంకా డెబ్యూ చేయకపోయినప్పటికీ, ముంబై కంటే ఇక్కడ ఎక్కువ మ్యాచులు ఆడే ఛాన్స్ దక్కుతుందని అర్జున్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ తన కెరీర్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ముంబై టీమ్‌లో బౌలింగ్ బాగా చేసినా ఎక్కువ అవకాశాలు రాలేదు కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన చాలా మెచ్యూర్డ్‌గా సమాధానం ఇచ్చాడు. "ఎక్కువ మ్యాచులు ఆడాలని ఎవరికి ఉండదు? బెంచ్ మీద కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉంటుంది. కానీ కష్టపడి పని చేయడం, అవకాశం వచ్చినప్పుడు పర్ఫార్మ్ చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది" అని అర్జున్ స్పష్టం చేశాడు.























