Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
పెళ్లంటే రెండు జీవితాలను కలిసి నడిపించే మూడు ముళ్ల బంధం. ఓ మహిళకు పెళ్లితోనే జీవితం సార్దకమవుతుంది.భార్యగా, తల్లిగా సంపూర్ణ మహిళగా గుర్తింపు లభిస్తుంది. ఇలా.. ఇవన్నీ ఒకప్పటి సెంటిమెంట్లు అంటున్నారు నేటి తరం మహిళలు. పెళ్లంటే నూరేళ్ల పంట కాదు, మా జీవితాలకు ఓ తంట అంటూ భారంగా భావిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పలంటూ ఇటీవల కాలంలో పెళ్లికాని ప్రసాద్ లకు పోటీగా పెళ్లికాని సురేఖల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోయింది.
అమ్మాయిల్లో 18ఏళ్లు, అబ్బాయిలైతే 21 ఏళ్లు దాటితే పెళ్లీడు వచ్చినట్లే .కానీ అమ్మాయిల్లో ఆ సంఖ్య నెమ్మదిగా 25 ఏళ్లకు చేరుకుంది. అది కాస్తా ఇప్పుడు 35 నుండి 40 ఏళ్లు రావాల్సిందే అనే పరిస్దితులు వచ్చేశాయి.ఇంతలా మహిళల్లో పెళ్లిపై ఆశక్తి తగ్గిపోవాడానికి కారణాలు అనేకం..
ఇవన్నీ అక్షర సత్యాలే. జెన్ జీ జనరేషన్ యువతుల్లో ఆలోచనలు , జీవితంపై అభిప్రాయాలు , పెళ్లిపై వ్యతిరేకత, స్వేచ్చా జీవితాలను వదులు కోవడానికి ఇష్టపడకపోవడం, భర్త క్రింద బానిసలా ఎందుకు బ్రతకాలి అనే ఆలోచనలు బలంగా వినిపిస్తున్నాయి. జెన్ జీ యువతులు ఇలా ఉంటే నైన్టీస్ జనరేషన్ మహిళలు సైతం పెళ్లిపై ఆలోచనలు మార్చేసుకుంటున్నారు. కెరీర్ పై ఫోకస్ పెరగడం, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటే ఆర్దిక ఇబ్బందులు లేకుండా జీవించడంతోపాటు జీవిత భాగస్వామితో మనస్పర్దలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఫిక్స్ అవుతున్నారు. 35నుండి 40 ఏళ్ల లోపు కుటుంబ బాధ్యతలు పూర్తి చేసుకుని , ఈలోపు ఒంటరిగా జీవితాలన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. లాంగ్ ట్రిప్ లు, వీకెండ్ పార్టీలు ఇలా ఎంజాయ్ చేసేవాళ్లు కొందరైతే, పెళ్లిలోపే దేశంలోని ప్రముఖ దేవాలయాలు, టూరిజం స్పాట్ లు తిరుగుతూ చిన్న చిన్న సరదాలు తీర్చుకునేవాళ్లు మరికొందరు.





















