అన్వేషించండి

Aspiring acto tragedy: సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు - సినీ ఆఫీసులోనే కన్నుమూసిన ఔత్సాహిక నటుడు

Hyderabad film office ఛ సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో తిరిగి తిరిగి ఓ వ్యక్తి అలసిపోయి చనిపోయాడు. వృత్తి రీత్యా రైతు అయినా.. వేషాల కోసం తిరిగినా ప్రయోజనం లేకపోయింది.

Man died of heart attack at Hyderabad film office:  ఆ గొంతులో ఎన్నో సినిమా డైలాగులు.. ఆ కళ్లలో వెండితెరపై తనను తాను చూసుకోవాలన్న వేల కలలు. నాగలి పట్టి పొలం దున్నినా, మనసంతా మాత్రం రంగుల ప్రపంచం చుట్టూనే తిరిగేది. కానీ, విధి ఆ పచ్చని కలలను పటాపంచలు చేసింది. సినిమా అవకాశాల వేటలో విశాఖపట్నం నుంచి వచ్చిన ఒక మధ్యవయస్కుడు, చివరకు నగర నడిబొడ్డున గుండెపోటుతో కుప్పకూలిపోయి అనంతలోకాలకు వెళ్ళిపోయిన ఘటన ఫిలింనగర్ పరిసరాల్లో విషాదాన్ని నింపింది.                     

అనకాపల్లికి చెందిన వాడపల్లి సంజయ్  వృత్తిరీత్యా రైతు. వయసు 55 ఏళ్లు.  వ్యవసాయం చేస్తూనే సినిమాపై మక్కువ పెంచుకున్నాడు. తనలోని నటుడిని లోకానికి పరిచయం చేయాలని, పెద్ద హీరోల డైలాగులను వల్లె వేస్తూ, పాటలు పాడుతూ తనలోని కళను నిత్యం పోషించుకునేవాడు. ఎప్పటికైనా వెండితెరపై మెరుస్తానన్న మొండి ధైర్యంతో, నగరంలో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చినప్పుడల్లా ఫిలిం నగర్, కృష్ణానగర్ వీధుల్లో అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగేవాడు.

గత నెల 14న గంపెడు ఆశలతో నగరానికి చేరుకున్న సంజయ్, బుధవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఒక నిర్మాణ సంస్థ కార్యాలయానికి వెళ్ళాడు. ఏదైనా చిన్న అవకాశం వస్తుందేమో  అని ఆరా తీసిన అతడికి చేదు అనుభవం ఎదురైంది. ఆడిషన్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం ఎవరూ అవసరం లేదని సిబ్బంది చెప్పిన సమాధానం అతడిని నిరాశకు గురిచేసిందో ఏమో గానీ.. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్న సంజయ్, కొద్దిసేపటికే పక్కకు ఒరిగిపోయాడు. నిమిషాల వ్యవధిలోనే ఆ కుర్చీలోనే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.                          

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో అది తీవ్రమైన గుండెపోటుగా వైద్యులు ధృవీకరించారు. నిన్నటి దాకా ఆశగా తిరిగిన మనిషి, అలిసిపోయి అనంత నిద్రలోకి జారుకోవడంతో ఆ నిర్మాణ సంస్థ సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. అవకాశాల వేటలో ప్రాణాలు కోల్పోవడం సినీ రంగంలోని తీవ్ర ఒత్తిడిని, పోరాటాన్ని మరోసారి కళ్లకు కట్టినట్లయింది.

సంజయ్ ఆకస్మిక మరణవార్త విన్న అనకాపల్లిలోని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వెండితెరపై వెలుగులీనాలని వెళ్లిన మనిషి, ఇలా విగతజీవిగా మారుతాడని ఊహించలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా నటన కోసం తపించిన ఒక నిస్సహాయ కళాకారుడి ప్రయాణం, చివరకు ఒక ఆఫీసు గదిలోని కుర్చీలోనే ముగిసిపోవడం అందరినీ కలచివేస్తోంది.                

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Embed widget