అన్వేషించండి

Target Harish Rao: తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?

Harish Rao: హరీష్ రావుపై ఎప్పుడూ లేని విధంగా రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణ కూడా చేయిస్తామంటున్నారు. దీంతో తెర వెనుక ఏం జరుగుతోందన్న చర్చ ప్రారంభమయింది.

Is Harish Rao being targeted in Telangana politics:  తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాజీ మంత్రి హరీష్ రావు చుట్టూ తిరుగుతున్నాయి. నిన్నటి వరకు కేటీఆర్, కవితలపైనే విమర్శనాస్త్రాలు సంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు తన రూటు మార్చి హరీష్ రావును టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హరీష్ రావుపై భూకబ్జా ఆరోపణలు చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

భూకబ్జా ఆరోపణలు.. వ్యక్తిగత విమర్శల పర్వం!

రేవంత్ రెడ్డి నేరుగా పేరు ఎత్తకపోయినా, హరీష్ రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. ముఖ్యంగా కన్న తండ్రిని పట్టించుకోని వారు.. ప్రజలను ఏం పట్టించుకుంటారు  అనే అర్థం వచ్చేలా రేవంత్ చేసిన ఆరోపణలు హరీష్ రావును తీవ్రంగా ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావుపై ఇలాంటి వ్యక్తిగత , అవినీతి ఆరోపణలు రావడం ఆయన ఇమేజ్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వం ఇప్పటికే హరీష్ అనుచరులు, ఆయనకు సంబంధించిన భూ వ్యవహారాలపై విచారణకు ఆదేశించడం ఆయనను మరింత ఒత్తిడిలోకి నెట్టింది.

 బీజేపీ అస్త్రాన్ని వాడుకుంటున్న రేవంత్ రెడ్డి? 

ఈ పరిణామాల మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కొత్త ట్విస్ట్‌ను ఇచ్చాయి. రేవంత్ రెడ్డి కావాలనే హరీష్ రావును ఒంటరిని చేస్తున్నారని, కేటీఆర్ మరియు కవితలతో రేవంత్ కున్న రహస్య ఒప్పందంలో భాగంగానే ఈ వ్యూహం నడుస్తోందని సంజయ్ ఆరోపించారు. అంటే, బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి, కల్వకుంట్ల కుటుంబంలోని అంతర్గత విభేదాలను రేవంత్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్నది బీజేపీ వాదన. ఈ ఆరోపణల్లో నిజమెంత ఉన్నా, రేవంత్ రెడ్డి ఒక్కసారిగా హరీష్ పై పడటం వెనుక బీఆర్ఎస్ కేడర్‌ను గందరగోళానికి గురిచేసే ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది.

 హరీష్ రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! 

ప్రస్తుతానికి పరిస్థితులు హరీష్ రావుకు వ్యతిరేకంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వపరంగా విచారణలు, ఇటు రాజకీయంగా సొంత పార్టీలోనే ప్రాధాన్యత తగ్గిపోతోందన్న ప్రచారం ఆయనను ఆత్మరక్షణలో పడేశాయి. కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే హరీష్ రావుపై ఈ స్థాయిలో దాడులు జరగడం యాదృచ్ఛికం కాదని రాజకీయ పండితులు భావిస్తున్నారు. హరీష్ రావుకు ఉన్న మాస్ ఇమేజ్‌ను దెబ్బతీయడం ద్వారా బీఆర్ఎస్‌ను బలహీనపరచవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

 ట్రబుల్ షూటర్ ముందన్న సవాల్ 

ఎన్నికల సమయంలో లేదా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సంక్షోభాలను చక్కదిద్దే హరీష్ రావు, ఇప్పుడు తన సొంత రాజకీయ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హరీష్ రావు తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. కానీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీజేపీ నేతల విమర్శల మధ్య ఆయన తన పట్టును ఎలా నిలుపుకుంటారో చూడాలి.
 
రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు పోరు రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉంది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూనే, మరోవైపు తనపై వస్తున్న అవినీతి మరకలను తొలగించుకోవాల్సిన బాధ్యత హరీష్ పై ఉంది. రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ మైండ్ గేమ్ ' బీఆర్ఎస్‌లో చీలిక తెస్తుందా లేక హరీష్ రావును మరింత బలమైన నేతగా మారుస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. 

 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget