అన్వేషించండి

Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?

తెలంగాణ ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా అందించే పౌర సేవల వినియోగ ఛార్జీలను 50 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీతో కలిసి 78 శాతం భారం పడనుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మీసేవ కేంద్రాలలో పౌర సేవలకు జీఎస్టీతో పాటు ఛార్జీలు పెరిగాయి.
  • వర్గం A సేవల రుసుము 35 నుండి 62 రూపాయలకు, వర్గం B 45 నుండి 80కి పెరిగింది.
  • జీఎస్టీతో కలిపి మొత్తం భారం 77% వరకు పెరిగింది.
  • మీసేవ నిర్వాహకుల కమీషన్ కూడా గణనీయంగా పెరిగింది.

Telangana Meeseva Charges: తెలంగాణ రాష్ట్రంలో పౌర సేవలను డిజిటల్‌ రూపంలో ప్రజలకు చేరవేసే మీ సేవ కేంద్రాల ఛార్జీల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 15 ఏళ్లుగా ఉన్న పెంపు డిమాండ్‌ను ఇన్ని రోజులు నెరవేర్చారు. ఇప్పుడు పెరిగిన ఛార్జీల ప్రకారం ఏయే సర్టిఫికెట్లకు ఎంత వసూలు చేస్తారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వుల మేరకు, బుధవారం నుంచి అన్ని రకాల పౌరసేవలపై వినియోగ ఛార్జీలు పెరిగాయి. గతంలో కేవలం వినియోగ ఛార్జీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం వీటికి 18 శాతం జీఎస్టీని అదనంగా చేర్చింది. 

చార్జీల పెంపు ఎలా ఉందంటే?

మీ సేవలో అందించే సేవలను ప్రధానంగా రెండు కేటగిరీలుగా విభజిస్తారు. కేటగిరి ఏలో ఉండే డాక్యుమెంట్ స్కాన్ లేదా సంబంధిత విభాగాల విచారణ అవసరం లేని సేవలు ఉంటాయి. గతంలో దీనికి 35 రూపాయలు వసూలు చేసే వారు. ఇప్పుడు దీన్ని 62 రూపాయలకు పెంచారు. 

కేటగిరి బీలో వివిధ శాఖల విచారణ లేదా పరిశీలిన తర్వాత అందించే సేవలు వస్తాయి. ఈ కేటగిరి కింద అందించే సేవలకు 45 రూపాయలు తీసుకునే వాళ్లు. ఇప్పుడు దాన్ని 80 రూపాయలకు పెంచారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన పెంపు 50శాతమే అయినప్పటికీ జీఎస్టీని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ భారం 77 శాతం నుంచి 78 వరకు పెరుగుతుంది. 

ఎవరిపై ఎలాంటి భారం పడుతుంది?

ఈ ధరల పెంపు ముఖ్యంగా సర్టిఫికెట్లు కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లి వారిపై ప్రభావం చూపనుంది. ఇప్పటి వరకు కుల ధ్రువీకరణ పత్రం తీసుకునే వారు కేవలం 45 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ కోసం 80 రూపాయలు చెల్లించాలి. గతంలో దరఖాస్తుతోపాటు నాలుగు కంటే ఎక్కువ పేజీలు స్కాన్ చేయాల్సి వస్తే పేజీకి రెండు రూపాయలు వసూలు చేసే వాళ్లు ఇప్పుడు అది 2.50కు పెంచారు. 

మీసేవ నిర్వాహకులకు పెరిగిన కమిషన్ 

ప్రజలపై భారం వేసిన ప్రభుత్వం మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఊరట కల్పించింది. వారి కమిషన్లు పెంచింది. కేటగిరి ఏలో సేవలకు గతంలో 13 రూపాయల కమీషన్ ఉండేది. దీన్ని ఇప్పుడు 40.34 రూపాయలకు పెంచారు. కేటగిరి బీ సేవలకు 52.10 రూపాయాల కమిషన్ ఇస్తారు. 

ఎక్కువ తీసుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

ప్రభుత్వం నిర్ణయించిన ఈ కొత్త ధరల కంటే మీ సేవ కేంద్రాల నిర్వాహకులు అదనంగా వసూలు చేయడానికి లేదు. అలా ఎవరైనా వసూళ్లకు పాల్పడిదే 1100 లేదా 18004251110 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు లేదా. meesevasupport@telangana.gov.inకు మెయిల్ చేయవచ్చు.    

Frequently Asked Questions

మీసేవా ఛార్జీలు ఎప్పటినుంచి పెరిగాయి?

బుధవారం నుంచి అన్ని రకాల పౌరసేవలపై వినియోగ ఛార్జీలు పెరిగాయి. దీనికి అదనంగా 18% GST కూడా చేర్చబడింది.

వర్గం A లోని సేవలకు పాత మరియు కొత్త ఛార్జీలు ఏమిటి?

వర్గం A (డాక్యుమెంట్ స్కాన్ లేదా విచారణ అవసరం లేనివి) లోని సేవలకు గతంలో 35 రూపాయలు వసూలు చేసేవారు, ఇప్పుడు 62 రూపాయలకు పెంచారు.

వర్గం B లోని సేవలకు పాత మరియు కొత్త ఛార్జీలు ఏమిటి?

వర్గం B (వివిధ శాఖల విచారణ అవసరమైనవి) లోని సేవలకు గతంలో 45 రూపాయలు వసూలు చేసేవారు, ఇప్పుడు 80 రూపాయలకు పెంచారు.

కుల ధ్రువీకరణ పత్రం కోసం ఎంత చెల్లించాలి?

ఇప్పటివరకు కుల ధ్రువీకరణ పత్రం కోసం 45 రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు 80 రూపాయలు చెల్లించాలి.

మీసేవా కేంద్రాలు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

మీసేవా కేంద్రాలు నిర్ణయించిన ధరల కంటే అదనంగా వసూలు చేస్తే 1100 లేదా 18004251110 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు లేదా meesevasupport@telangana.gov.in కు మెయిల్ చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
Embed widget