By: Arun Kumar Veera | Updated at : 23 Feb 2025 04:37 PM (IST)
ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ( Image Source : Other )
Health Insurance Is Becoming A Key Factor In Job Offers: వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరిగిన ప్రస్తుత కాలంలో, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా, కోవిడ్-19 మహమ్మారి ఆరోగ్య బీమా ప్రాముఖ్యతను చాలా పెంచింది. రాబోయే దశాబ్ద కాలంలో, భారతదేశ జనాభాలో 15 శాతం మందికి 40 ఏళ్లు నిండుతాయని అంచనా. అంటే, దేశంలో ఆరోగ్య వ్యయం పెరిగే అవకాశం ఉంది.
ఆరోగ్య బీమా వల్ల అకస్మాత్ వైద్య ఖర్చుల నుంచి తప్పించుకోవడమే కాదు, ఇప్పుడది ఉద్యోగాల విషయంలోనూ కీలక తాయిలంగా మారింది. ఉద్యోగులను నిలుపుకోవడానికి కంపెనీ యాజమాన్యాలు ఆరోగ్య బీమాకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఆర్థిక రక్షణ
ఆరోగ్య బీమా ప్రాథమిక ప్రయోజనం.. అది, ఉద్యోగితో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ అందించడం. ఆరోగ్య బీమా లేకపోతే ఆసుపత్రి బిల్లులు & ఆర్థిక ఒత్తిడి పెరుగుతాయి. బీమా ఉంటే ఖర్చులో కొంత భాగాన్ని అది కవర్ చేస్తుంది. దీనివల్ల, ఉద్యోగులు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడరు, మంచి వైద్యం అందుకుంటారు. ఉద్యోగి శారీరకంగా & మానసికంగా త్వరగా కోలుకుంటాడు, ఇది కంపెనీలకు కూడా ప్రయోజనం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఉద్యోగులకు/ ఖరీదైన చికిత్సలు అవసరమయ్యే వాళ్లకు బీమా రూపంలో ఆర్థిక రక్షణ చాలా ముఖ్యం. ఈ విషయాన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి.
ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత
ఉద్యోగులకు ఆరోగ్య బీమా ఉంటే క్రమంతప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. దీనివల్ల, ఏదైనా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు, వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు. ఇది, మెరుగైన ఫలితాలను ఇవ్వడంతో పాటు వైద్య ఖర్చులను కూడా తగ్గిస్తుంది.
కుటుంబ కవరేజ్
ఇప్పుడు, ఉద్యోగి కుటుంబం మొత్తాన్ని కవర్ చేసే ఆరోగ్య బీమా పథకాలను కూడా కంపెనీ యాజమాన్యాలు అందిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఇది చాలా అవసరమవుతుంది, అవసరమైనప్పుడు అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల, ఉద్యోగి ఎలాంటి మెంటల్ టెన్షన్ & మనీ టెన్షన్ లేకుండా మనశ్శాంతిగా పని చేసుకోగలడు. ఉద్యోగి సంతోషంగా ఉంటే ఉత్పాదకత & నిబద్ధత పెరిగే అవకాశం ఉంది.
పన్ను ఆదా
కంపెనీ అందించే ఆరోగ్య బీమా పథకాలు ఉద్యోగులకు ఆదాయ పన్ను ఆదాను అందిస్తాయి. ఈ రూపంలోనూ అతనికి డబ్బు సేవ్ అవుతుంది. ఉద్యోగులు ఫ్లెక్సిబుల్ స్పెండింగ్ అకౌంట్స్ (FSAs) లేదా హెల్త్ సేవింగ్ అకౌంట్స్ (HSAs) నుంచి కూడా పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
ఒక మంచి ఆరోగ్య బీమా అటు ఉద్యోగికి, ఇటు కంపెనీకి ఇద్దరికీ ప్రయోజనకరం. మారుతున్న కాలంతోపాటు, ఆరోగ్య బీమా కూడా ఉద్యోగి ఓవరాల్ కాంపన్షేషన్ ప్యాకేజీలో భాగంగా మారుతోంది. కంపెనీలు ఆకర్షణీయమైన హెల్త్ ప్యాకేజీ ఆఫర్లతో టాలెంట్‌ను నిలెబ్టటుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఉద్యోగులు కూడా, మంచి ఆరోగ్య బీమా ప్యాకేజీలు అందిస్తున్న కంపెనీలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: ఒకటీ, రెండూ కాదు - ఏకంగా రూ.51,000 కోట్లు పోగొట్టుకున్న స్విగ్గీ షేర్‌హోల్డర్లు
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?