By: Arun Kumar Veera | Updated at : 23 Feb 2025 03:09 PM (IST)
ఓవర్ వాల్యుయేషన్ నుంచి డౌన్ ( Image Source : Other )
Swiggy Share Price Crash: జొమాటో (Zomato)కు పోటీగా ఫుడ్ డెలివరీ & క్విక్ కామర్స్ విభాగాల్లో ముందుకు దూసుకుపోతున్న స్విగ్గీ.. షేర్ ప్రైస్ విషయంలో మాత్రం రివర్స్‌లో ఉంది. ఇటీవలి కాలంలో ఈ కంపెనీ షేర్ ధర భారీగా తగ్గింది, దాని అత్యధిక స్థాయి నుంచి 50 శాతం పడిపోయింది. ఈ కారణంగా, స్విగ్గీ షేర్ హోల్డర్లు రూ. 50,000 కోట్లకు పైగా నష్టపోయారు.
ఓవర్ వాల్యుయేషన్ నుంచి డౌన్
స్విగ్గీ, గత ఏడాది (2024) నవంబర్‌లో IPOను తీసుకొచ్చింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే సమయానికి కంపెనీ వాల్యుయేషన్ 12.7 బిలియన్ డాలర్లుగా ఉంది. లిస్టింగ్ తర్వాత షేర్లు ఉరకలెత్తడంతో, 2024 డిసెంబర్ నాటికి ఈ కంపెనీ మార్కెట్ విలువ (Swiggy market cap) రూ. 1,32,800 కోట్లకు (16 బిలియన్ డాలర్లు) పెరిగింది. ఆ సమయానికి అది ఓవర్ వాల్యుయేషన్ జోన్‌లోకి చేరింది. తర్వాత, స్టాక్ మార్కెట్ పతనం కారణంగా స్విగ్గీ వాల్యుయేషన్ కోత ప్రారంభమైంది. గత ట్రేడింగ్ సెషన్ అయిన శుక్రవారం (2025 ఫిబ్రవరి 21) నాటికి, స్విగ్గీ మార్కెట్ క్యాప్ రూ. 81,527 కోట్లకు (9.82 బిలియన్ డాలర్లు) పడిపోయింది. అంటే, వాల్యుయేషన్‌లో రూ. 51,273 కోట్ల తగ్గుదల కనిపించింది.
స్విగ్గీ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో రూ. 420 వద్ద & బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో రూ. 412 వద్ద లిస్ట్ అయ్యాయి. మార్కెట్ పతనం కారణంగా స్టాక్ ప్రైస్ ఇప్పుడు రూ. 360కి పడిపోయింది. అంటే, IPO ప్రైస్‌తో పోలిస్తే షేర్ ధర ఇప్పటి వరకు రూ. 60 తగ్గింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు స్విగ్గీ షేర్లు 33 శాతానికి పైగా పడిపోయాయి.
బలహీన Q3 ఫలితాలు
FY25 మూడో త్రైమాసికంలో ఊహించిన దానికంటే బలహీనమైన ఫలితాలను స్విగ్గీ నివేదించింది. షేర్ ధర పతనానికి ఇది కూడా కారణం. 2024 అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఈ ఫుడ్ డెలివెరీ కంపెనీ రూ. 799.08 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా, అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ. 625.53 కోట్లుగా ఉంది. IPO తర్వాత షేర్లపై లాక్-ఇన్ పీరియడ్ ముగియడం కూడా షేరు ధర తగ్గడానికి కారణమైంది. ఈ ఏడాది జనవరి 29న 29 లక్షల షేర్ల అన్‌లాకింగ్ పూర్తయింది. జనవరి 31న మరో 3,00,000 షేర్లు అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. ఫిబ్రవరి 10న గరిష్టంగా 6.5 కోట్ల షేర్లు అన్‌లాక్ అయ్యాయి. ఫిబ్రవరి 19న మరో 1,00,000 షేర్లు అందుబాటులోకి వచ్చాయి. బల్క్ డీల్స్ లేకపోవడంతో, ఫిబ్రవరి 14న స్విగ్గీ షేర్లు ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ. 323కి చేరుకున్నాయి.
2024 నవంబర్‌లో స్విగ్గీ IPOతో మార్కెట్ ముందుకు వచ్చిన స్విగ్గీ, రూ. 390 ఇష్యూ ప్రైస్ దగ్గర డబ్బును సేకరించింది. కానీ, స్టాక్ మార్కెట్ పతనం స్విగ్గీ స్టాక్‌ను ప్రభావితం చేసింది. ఈ కంపెనీ ఫుడ్ డెలివరీ & క్విక్ కామర్స్‌లో గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఉద్యోగులకు బంపర్ బెనిఫిట్ - UPI ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఛాన్స్!
Canadian Salary: కెనడాలో C$30,000 జీతం సంపాదిస్తే భారత్‌లో దాని విలువ ఎంత? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
Money Rules: ఏప్రిల్ నుంచి మీ చేతిలో డబ్బే డబ్బు! - మీ ఇష్టానికి ఖర్చు చేయొచ్చు
TDS, TCS New Rules: ఏప్రిల్ నుంచి టీడీఎస్-టీసీఎస్‌లో కీలక మార్పులు - విదేశాల్లో చదివేవాళ్లకు భారీ ఊరట
Gold-Silver Prices Today 28 Mar: టారిఫ్‌ల దెబ్బకు మళ్లీ 92000 దాటిన పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Tax on ULIPs: 'యులిప్'లపై టాక్స్ మోత - ఏప్రిల్ నుంచి ఏం మారుతుంది?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గడ్డపై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల తర్వాత సీఎస్కేపై విక్టరీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
KKR Vs LSG Match Reschedule బీసీసీఐ కీలక నిర్ణయం- కోల్‌కతా, లక్నో మ్యాచ్ వాయిదా.. తేదీ మార్పుపై ప్రకటన