Most sixes in single World Cup: సిక్సర్ల క్వీన్ రిచా ఘోష్.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ రికార్డును బద్దలు కొట్టి, వరల్డ్ నెంబర్ 1గా
Richa Ghosh Sixers Record | ప్రపంచ కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా రిచా ఘోష్ నిలిచింది. ప్రపంచంలోనూ అత్యధిక సిక్సర్ల రికార్డు తన పేరిట లిఖించుకుంది.

Most sixes in single World Cup: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదడంతో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ కప్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రిచా ఘోష్ నిలిచింది. ఈ మ్యాచులో రిచా ఘోష్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 34 పరుగులు చేసింది. ఆమె 2025 ప్రపంచ కప్‌లో 12 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ కు చెందిన డియాండ్రా డాటిన్, దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్ లీ లు కూడా ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో 12 సిక్సర్లు కొట్టారు.
మహిళల ప్రపంచ కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాటర్లు
1. రిచా ఘోష్ (భారత్) - 12 సిక్సర్లు
టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ మహిళల ప్రపంచ కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్. రిచా 2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో 12 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించింది.
2. డియాండ్రా డాటిన్ (వెస్టిండీస్) - 12 సిక్సర్లు
మహిళల ప్రపంచ కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండవ బ్యాటర్ వెస్టిండీస్‌కు చెందిన డియాండ్రా డాటిన్. డాటిన్ 2013 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో 12 సిక్సర్లు కొట్టింది.
3. లిజెల్ లీ (దక్షిణాఫ్రికా) - 12 సిక్సర్లు
దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్ లీ మహిళల ప్రపంచ కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్. లిజెల్ కూడా 2017 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో 12 సిక్సర్లు కొట్టింది.
4. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్) - 11 సిక్సర్లు
మహిళల ప్రపంచ కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన 4వ బ్యాటర్ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. హర్మన్‌ప్రీత్ 2017 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో 11 సిక్సర్లు బాదింది.
5. నాడిన్ డి క్లార్క్ (దక్షిణాఫ్రికా) - 10 సిక్సర్లు
దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ నాడిన్ డి క్లార్క్ మహిళల ప్రపంచ కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన 5వ బ్యాటర్. నాడిన్ 2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో 10 సిక్సర్లు కొట్టింది.
హర్మన్‌ప్రీత్ రికార్డును బద్దలు కొట్టిన రిచా ఘోష్
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 2 సిక్సర్లు కొట్టడం ద్వారా రిచా ఘోష్ మొత్తం 12 సిక్సర్లతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డును బద్దలు కొట్టింది. రిచా ఇప్పుడు ప్రపంచ కప్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్ మాత్రమే కాదు, ప్రపంచంలోనే నెంబర్ వన్ గా డాటిన్, లిజెన్ లీలతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. హర్మన్‌ప్రీత్ 2017 ప్రపంచ కప్‌లో ఈ రికార్డును నెలకొల్పింది. ఆ ప్రపంచ కప్‌లో హర్మన్ ప్రీత్ 11 సిక్సర్లు కొట్టింది. తాజా ఎడిషన్లో 12 సిక్సర్లతో వికెట్ కీపర్ రిచా ఘోష్ ఈ రికార్డు తిరగరాసింది.





















