Womens World Cup Winner: దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
Team India Historic win | భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ నెగ్గింది. డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఫైనల్లో విశ్వ విజేతగా నిలిచింది.

Womens World Cup 2025 Winner: ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ మూడో ప్రయత్నంలో ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచింది. గతంలో రెండు పర్యాయాలు ఫైనల్ చేరుకున్నా ఓటమి చెందింది. తాజాగా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టు మీద దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🏆
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
Congratulations to #TeamIndia on winning their maiden ICC Women's Cricket World Cup 🇮🇳
Take. A. Bow 🙌#WomenInBlue | #CWC25 | #Final | #INDvSA pic.twitter.com/rYIFjasxmc
ప్రధాని మోదీ శుభాకాంక్షలు..
ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు అద్భుతమైన విజయం సాధించిందన్నారు ప్రధాని మోదీ. భారత్ సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్‌లో వారి ప్రదర్శన గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసం నెగ్గిందన్నారు. టోర్నమెంట్ అంతటా జట్టు అసాధారణమైన జట్టుకృషిని, పట్టుదలను ప్రదర్శించిందని కొనియాడారు. మా క్రీడాకారులకు అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్ ఛాంపియన్‌లను క్రీడల దిశగా నడిచేలా ప్రేరేపిస్తుందన్నారు.
A spectacular win by the Indian team in the ICC Women’s Cricket World Cup 2025 Finals. Their performance in the final was marked by great skill and confidence. The team showed exceptional teamwork and tenacity throughout the tournament. Congratulations to our players. This…
— Narendra Modi (@narendramodi) November 2, 2025
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మన అమ్మాయిలు మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశారు. వారి అద్భుతమైన ప్రదర్శన, అవిశ్రాంత దృఢ సంకల్పం, అజేయ స్ఫూర్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చాయి. యావత్ ప్రపంచాన్ని వారి విజయం ఆశ్చర్యంలో ముంచెత్తిందని.. మన ఛాంపియన్లకు అభినందనలు అని చంద్రబాబు పోస్ట్ చేశారు.
#WomenInBlue#INDWvSAW #CWC25 #Final
— N Chandrababu Naidu (@ncbn) November 2, 2025
The Indian Women’s Cricket Team has scripted history by winning the World Cup! Our daughters have made the entire nation proud. Their remarkable performance, tireless determination, and indomitable spirit have inspired every Indian and left… pic.twitter.com/R9bKE5RoKT
భారత మహిళల జట్టుపై రేవంత్ రెడ్డి ప్రశంసలు
#WomensWorldCup2025 లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం సాధించినందుకు తెలంగాణ సీఎం రేవంత్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ లో వియం సాధించి ప్రతిష్టాత్మక టైటిల్‌ను నెగ్గిన భారత మహిళా క్రికెటర్ల బలం, ధైర్యసాహసాలు, దృఢ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుతమైన నాయకత్వం, ఫైనల్స్‌లో జట్టు అద్భుతమైన ప్రదర్శనను రేవంత్ రెడ్డి ప్రశంసించారు. దశాబ్దాల కల నెరవేరినందుకు మొత్తం మహిళా జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు, వారి అద్భుతమైన విజయానికి దేశం మొత్తం గర్వంగా నిలుస్తుందని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి, పోరాట స్ఫూర్తి దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు ఉదాహరణగా నిలిచాయని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాత్మక విజయానికి దారితీసిన అదే ఉత్సాహం, ఐక్యత మరియు ఆత్మవిశ్వాసంతో జట్టు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించగలదని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
Hon’ble Chief Minister Shri @revanth_anumula extended heartfelt congratulations to the Indian women’s cricket team for their spectacular triumph in the #ICCWomensWorldCup2025. He lauded the team for their unwavering strength, grit, and determination in securing the coveted title… pic.twitter.com/OxiWUlbUqg
— Telangana CMO (@TelanganaCMO) November 2, 2025





















