Parasakthi Censor Cuts: పాతిక సెన్సార్ కట్స్‌తో 'పరాశక్తి' రిలీజ్... శివకార్తికేయన్ సినిమా రన్ టైమ్ ఎంత? ఏయే సీన్లు లేపేశారు?
Parasakthi Release Censor Issue: 'పరాశక్తి' ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు పాతిక కత్తెరలు వేసుకుంది.

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా సినిమా 'పరాశక్తి'. ఈ రోజు (జనవరి 10న) థియేటర్లలోకి వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు UA (16+) సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ సమస్యకు తెర పడింది. అయితే సినిమాకు పాతిక కట్స్ ఇచ్చింది. అవి ఏమిటో ట్వీట్‌లో చూడండి.
Disgusting from #Parasakthi team!!
— cinee worldd (@Cinee_Worldd) January 9, 2026
Calling Telugu People as “Golti” in Tamil Version twice is Unacceptable.
Director Sudha kongara being a Telugu Women & #Sivakarthikeyan who was accepted & Supported well in telugu states using Such language in a film is Nasty.
We are… pic.twitter.com/epTfz7QajE
రెడ్ జెయింట్ మూవీస్, డాన్ పిక్చర్స్ సంస్థలు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాయి. అభిమానులతో సెన్సార్ ఇష్యూ క్లియర్ అయిన ఆనందాన్ని పంచుకుంటూ... ''అన్ని వయసుల వారితో మాట్లాడే అగ్ని. పరాశక్తి UA సర్టిఫికేట్‌తో సెన్సార్ చేయబడింది. రేపటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది. పరాశక్తి పొంగల్... జనవరి 10 నుండి థియేటర్లలోకి పరాశక్తి'' అని పేర్కొన్నారు.
A fire that speaks to all ages 🔥#Parasakthi censored with a U/A - striking theatres worldwide from Tomorrow#ParasakthiFromPongal#ParasakthiFromJan10@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @DawnPicturesOff @redgiantmovies_ @Aakashbaskaran… pic.twitter.com/H4IPvMfUkw
— Red Giant Movies (@RedGiantMovies_) January 9, 2026
CBFC నుండి 'పరాశక్తి'కి అనుమతి
సెన్సార్ నుంచి అనుమతి రావడంతో 'పరాశక్తి' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. 'పరాశక్తి' కథ విషయానికి వస్తే... 1960లలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో తీశారు. CBFC మొదట దాదాపు 23 కట్‌లను సూచించింది. దర్శకురాలు సుధా కొంగర ముంబైలోని సెన్సార్ బోర్డుకు నేరుగా ఈ చారిత్రక సందర్భాన్ని మార్చే ఏ కట్‌ను అంగీకరించనని చెప్పారు. ఇప్పుడు చాలా కష్టపడి సినిమాకు అనుమతి లభించింది.
Also Read: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
అసలు సినిమా కథేమిటంటే?
'పరాశక్తి' సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ సినిమా శివకార్తికేయన్‌తో పాటు అథర్వ మురళీ, శ్రీలీల, రవి మోహన్ కూడా నటించారు. ఈ సినిమాలో 1965లో పోలాచ్చి, తమిళనాడులో జరిగిన విద్యార్థి ఉద్యమాల నేపథ్యాన్ని చూపించారు. ఈ సినిమా సామాజిక - సాంస్కృతిక మార్పులు, చారిత్రక సంఘటనలను తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తుంది.




















