The Raja Saab Box Office Collection Day 1: ప్రభాస్ టాప్ 5లో లేదు కానీ... 'ది రాజా సాబ్' ఫస్ట్ డే ఇండియా నెట్ ఎంతంటే?
Raja Saab First Day Collection: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్'కు మొదటి రోజు ఇండియాలో మంచి ఓపెనింగ్ లభించింది. ఆయన టాప్ 5 సినిమాల్లో చోటు దక్కించుకోలేదు. కానీ...

Prabhas Raja Saab Box Office Collection Day 1 India Net: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హారర్ కామెడీ 'ది రాజా సాబ్' సంక్రాంతి పండుగకు ముందు థియేటర్లలో విడుదల అయ్యింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే విమర్శకుల నుండి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ... మొదటి రోజున సినిమా చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు చేరుకున్నారు. ప్రభాస్ స్టార్‌డమ్, మంచి ప్రమోషన్స్ కారణంగా... 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సాధించింది. అయితే ప్రభాస్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటి కాలేకపోయింది. మరి, 'ది రాజా సాబ్' మొదటి రోజున ఎంత వసూలు చేసిందో ఇక్కడ తెలుసుకోండి.
'ది రాజా సాబ్' ఓపెనింగ్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
'ది రాజా సాబ్' సినిమా విడుదలైన మొదటి రోజున... అంటే శుక్రవారం జనవరి 9న బాక్సాఫీస్ వద్ద 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రీ - రిలీజ్ కలెక్షన్లను కలిపి సినిమా మొత్తం వసూలు 54.15 కోట్ల రూపాయలకు చేరుకుంది. హారర్ కామెడీ సినిమాకు ఇవి మంచి వసూళ్లు అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో, ప్రేక్షకుల్లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఈ వసూళ్లు వచ్చాయి.
ప్రభాస్ కెరీర్‌లో టాప్ 6 ఓపెనర్... 'ది రాజా సాబ్'!
The Raja Saab India Net: 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రారంభాన్ని అందుకుందని చెప్పాలి. ప్రీ సేల్, ఓపెనింగ్ డే కలెక్షన్లను కలిపి రూ. 54.15 కోట్లు వసూలు చేసింది. దాంతో 'రాధే శ్యామ్' రూ. 43.1 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్లను అధిగమించి ప్రభాస్ కెరీర్‌లో ఆరో అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. అయితే ఇది ప్రభాస్ టాప్ 5 ఓపెనర్లలో చోటు దక్కించుకోలేకపోయింది.
Also Read: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
భారతీయ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ టాప్ ఓపెనింగ్ చిత్రాల జాబితా (నెట్):
- బాహుబలి 2 – 121 కోట్లు
- కల్కి 2898 AD – 95.3 కోట్లు
- సలార్ – 90.7 కోట్లు
- ప్రాజెక్ట్ K – 89 కోట్లు
- ఆదిపురుష్ – 86.75 కోట్లు
- ది రాజా సాబ్- 54.15 కోట్లు
ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో సంజయ్ దత్, జరీనా వహాబ్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటించారు. విమర్శలు వచ్చినప్పటికీ... దర్శక నిర్మాతలు 'ది రాజా సాబ్' సీక్వెల్ కన్ఫర్మ్ చేశారు. పండుగ వారం రాబోతున్నందున రాబోయే రోజుల్లో 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ దగ్గర తన పట్టు కొనసాగిస్తుందా? లేదా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.





















