చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు
సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆరోజు ఏం జరిగిందో అంతా వివరించారు. పోలీసులు వచ్చి అలెర్ట్ చేసినా సినిమా యూనిట్ పట్టించుకోలేదని, అందుకే తొక్కిసలాట జరిగిందని తేల్చి చెప్పారు. పర్మిషన్ ఇవ్వకపోయినా థియేటర్‌కి రావడం వల్లే ఇదంతా జరిగిందని స్పష్టం చేశారు. థియేటర్ బయట గందరగోళంగా ఉందని, వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా వినలేదని మండి పడ్డారు. చివరకు ఆయనను బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చిందని వివరించారు. అంత జరిగినా కూడా...మళ్లీ చేతులూపుకుంటూ రోడ్ షో చేస్తూ వెళ్లిపోయాడని ఫైర్ అయ్యారు. ఇలా ప్రవర్తించారు కాబట్టే పోలీసులు తమ విధి నిర్వహించారని, తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయకూడదా అంటూ ప్రశ్నించారు. సినిమా వాళ్లకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని మండి పడ్డారు. ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీపైనా ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పిల్లాడిని చూడడానికి ఒక్కరు కూడా వెళ్లలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.