Ind vs Pak Champions Trophy 2025 | కింగ్ విరాట్ కొహ్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడా | ABP Desam
కింగ్ విరాట్ కొహ్లీ అభిమానులైనా సరే...అతను అతని స్థాయిలో ఆడిన ఆఖరి అద్భుతమైన మ్యాచ్ అంటే ఠక్కున గుర్తొచ్చేది. 2022 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో. ఆరోజు కింగ్ కొహ్లీ ఛేజింగ్ లో పాకిస్థాన్ బౌలర్లుకు చూపించిన చుక్కలు వాళ్లు జీవితాంతం మర్చిపోలేరు. ప్రత్యేకించి ఆ లాంగాన్ సిక్సర్..ఆ పుల్ షాట్ సిక్సర్ లు లైఫ్ లాంగ్ వాళ్లను వెంటాడుతాయి. ఆ స్థాయిలో మ్యాచ్ మీద పట్టు చూపించి పాకిస్థాన్ కు పీడకలను మిగల్చటమే కాదు..తనను ఎందుకు కింగ్ అంటారనే నిరూపించాడు కొహ్లీ. మళ్లీ ఆ తర్వాత అడపాదడపా ఆడుతూనే ఉన్నాడు కానీ కొహ్లీ స్థాయికి తగిన ఇన్నింగ్స్ బాకీ పడి చాలా కాలమే అయ్యింది. అందుకే మూడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఛాన్స్ వచ్చింది. ఈరోజు దుబాయ్ లో జరుగుతున్న మ్యాచ్ లో అత్యంత బలహీనంగా కనిపిస్తున్న పాకిస్థాన్ ను కింగ్ కొహ్లీ చితక్కొడితే తను మళ్లీ ఫామ్ లోకి రావటంతో పాటు ఫ్యాన్స్ కు కావాల్సినంత ఆనందాన్ని అందించిన వాడు అవుతాడు విరాట్. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 22 పరుగులు చేసిన కొహ్లీ అందుకోసం 38 బాల్స్ ఆడాడు. అంత కాన్ఫిడెంట్ గానూ కనపడలేదు. పైగా స్పిన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇప్పుడు పాకిస్థాన్ లో కొహ్లీ ని ఇబ్బంది పెట్టగలిగే బౌలర్లు ఇద్దరు ఉన్నారు. ఒకరు హారిస్ రవూఫ్ అయితే మరొకరు అబ్రార్ అహ్మద్. హారిస్ రవూఫ్ ఆల్రెడీ ఇంతకు ముందు చాలా సార్లు చితక్కొట్టాడు కొహ్లీ. కానీ స్నిన్నర్ అయిన అబ్రార్ అహ్మద్ ను కొహ్లీ ఎలా ఎదుర్కొంటాడనేది చూడాలి. ఒకవేళ కొహ్లీ ఇవాళ తనలోని బీస్ట్ ను అన్ లీష్ చేస్తే మాత్రం ఈ ఆదివారం మర్చిపోలేని హ్యాపీ సండే అవుతుంది కింగ్ అభిమానులకు





















