Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
2024లో కొత్త టాలెంట్ ను టీమిండియాకు పరిచయం చేసింది. రోహిత్, కోహ్లీ, జడేజా, తాజాగా అశ్విన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ స్థానాలను భర్తీ చేయగల ఆటగాళ్ల వేట కొనసాగుతోంది.
Cricket News: 2024లో భారత్ తరపున అరంగేట్రం చేసిన క్రికెటర్లు: పాత నీరు వెళ్లి పోయి కొత్త నీరు రావడం సహజం. అప్పుడే అది చెరువైనా, నదైనా నిత్య నూతనంగా ఉంటుంది. ఈ సామెత క్రికెట్ కు కూడా వర్తిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ తరపున దిగ్గజాలు ఎందరో ఆడి, రిటైరవగా, వాళ్ల స్థానాలను మరిపించేలా మరెంతోమంది అరంగేట్రం చేస్తునే ఉన్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలాంటి దిగ్గజ క్రికెటర్లు కొన్ని ఫార్మాట్లలోనే ఆడుతున్నారు. వీరు కూడా రిటైర్మెంట్ కు దగ్గర పడ్డారు. మరి వీళ్ల స్థానంలో భారత్ కు ఆడబోయే ఆటగాళ్లు ఎవరనేది కాలమే నిర్ణయిస్తుంది. 2024లో కొంతమంది ప్లేయర్లు టీమిండియా తరపున అరంగేట్రం చేశారు.
అంతకుముందు వెస్టిండీస్‌లో రోహిత్ శర్మ & కో చారిత్రాత్మక T20 ప్రపంచ కప్ విజయాన్ని సాధించడం ద్వారా భారత క్రికెట్ జట్టు అభిమానులకు T20 ఫార్మాట్ అపారమైన ఆనందాన్ని అందించగా , టెస్ట్ క్రికెట్ సొంత గడ్డపై కూడా అధ్వాన్నమైన ప్రదర్శనలను నమోదయ్యాయి.
ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు చేరుకునే ముందు, న్యూజిలాండ్‌పై సొంతగడ్డపై భారత్ 3-0 తేడాతో అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఈ ఎత్తుపల్లాల నడుమ, కొత్త ప్రతిభ వెలుగులోకి రావడం వల్ల భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. 2024లో భారత క్రికెట్ జట్టులో తమదైన ముద్ర వేసిన ఐదుగురు అరంగేట్ర ఆటగాళ్లను వివరాలు చూద్దాం..
ధ్రువ్ జురెల్: యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఆ టెస్టులో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతను తరువాత తన T20 క్యాప్‌ను సంపాదించాడు. ఫార్మాట్‌లలో తను సానుకూలంగా ఆడాడు.
హర్షిత్ రాణా: ఆస్ట్రేలియా పర్యటనలో ఫాస్ట్ బౌలర్ అరంగేట్రం చేశాడు, రెండు టెస్టుల్లో నాలుగు వికెట్లతో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తొలిసారి ఆసీస్ గడ్డపై ఆడుతున్నప్పటికీ కాస్త ఆశాజనకమైన ప్రదర్శన ఇచ్చాడు.
సర్ఫరాజ్ ఖాన్: ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్టులో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌గా తన పేరుని నిలుపుకుని, ఆ మ్యాచ్ లో కీలక అర్ధశతకం సాధించాడు. అప్పటి నుండి అతను ఆరు టెస్టుల్లో ఆడాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ పై సెంచరీతో సత్తా చాటాడు. ఇంకా కీలక ఆటగాడిగా ఎదుగుతూనే ఉన్నాడు.
రియాన్ పరాగ్: బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయిన పరాగ్ శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జింబాబ్వేపై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకుని తన విలువేంటో చాటి చెప్పాడు. ముఖ్యంగా తన సత్తా చాటి, జాతీయ జట్టులో చోటు కోసం రేసులో నిలిచాడు.
నితీశ్ కుమార్ రెడ్డి: బీజీటీ లో అనూహ్యంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన తెలుగు తేజం, అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ సత్తా చాటుతున్నాడు. అంతకుముందు టీ20ల్లోనూ సత్తా చాటాడు. తనను బాగా ప్రొత్సహిస్తే సిసలైన బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా ఎదగుతాడని విశ్లేషకులు అంటున్నారు. పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు తను వారసుడవుతాడని పేర్కొంటున్నారు.
మయాంక్ యాదవ్: బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టీ20ఐ సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తన పేస్‌తో మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. గంటకు 150 కిమీతో వేయగల తను సానబెడితే మరింత రాటుదేలగలనడంలో ఎలాంటి సందేహం. భీకరమైన పేసర్ల కొరత టీమిండియాను వేధిస్తున్న నేపథ్యంలో తను ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Ravindra Jadeja Comments: వాళ్లు కచ్చితంగా రాణించాల్సిందే, లేకపోతే మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పడుతోంది: జడేజా