అన్వేషించండి

Yamaha XSR 155 లేదా KTM 160 డ్యూక్ బైక్‌లలో ఏది పవర్‌ఫుల్.. ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి

భారత మార్కెట్లో XSR 155, KTM 160 Duke మధ్య పోటీ నెలకొంది. యమహ 155, కేటీఎం 160 డ్యూక్ బైక్స్ ధర, ఇంజిన్, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏది ఉత్తమం తెలియాలంటే ఈ వివరాలు తెలుసుకోండి.

Yamaha XSR 155 భారత్‌లో టీ-వీలర్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి హాట్ టాపిక్‌గా మారింది. ఇది KTM 160 Duke వంటి పవర్ ఫుల్ స్ట్రీట్‌ఫైటర్ బైక్‌తో నేరుగా పోటీపడుతోంది. XSR 155 రెట్రో, ఆధునిక డిజైన్‌తో వస్తుంది. అయితే KTM 160 Duke దాని రఫ్ డిజైన్, బలమైన పనితీరుకు ఫేమస్ అయింది. రెండింటి ధర, ఇంజిన్, ఫీచర్లు, రైడ్ క్వాలిటీ వేర్వేరు అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. కాబట్టి మీకు ఏ బైక్ సరైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఎక్కువ పొదుపుగా ఉండేది ఏది?

ధర విషయానికి వస్తే Yamaha XSR 155 బైక్ రూ. 1.50 లక్షల ప్రారంభ ధరతో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం బైక్‌గా ఉంది. దీంతో పోలిస్తే KTM 160 Duke ధర రూ. 1.85 లక్షలు. ఇది ఎక్కువ మాత్రమే కాదు, దాని అధిక పనితీరు, ఇంజిన్, మోడ్రన్ టెక్నాలజీ కారణంగా ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ ప్రీమియం బైక్ కావాలనుకుంటే XSR 155 మంచి ఎంపిక. కానీ స్పోర్టీ రైడింగ్ మీ ఛాయిస్ అయితే డ్యూక్ బెటర్ ఛాయిస్.

ఎక్కువ సౌకర్యవంతమైనది ఏది?

స్పెసిఫికేషన్‌లను గమనిస్తే Yamaha XSR 155 బైక్ 134 కిలోల బరువు కారణంగా చాలా తేలికైనది. సిటీలో సులభంగా నడిపే బైక్ ఇది. దీని 160 mm గ్రౌండ్ క్లియరెన్స్, 810 mm సీటు ఎత్తు అన్ని రకాల రైడర్‌లకు సౌకర్యవంతంగా ఉంటుంది. KTM 160 Duke 147 కిలోల బరువుతో వస్తుంది. పొడవైన వీల్‌బేస్ హైవేపై గొప్ప స్థిరత్వాన్ని అందిస్తుంది. XSR 155 రైడింగ్‌కు మంచి కంట్రోల్ ఉంటుంది. డ్యూక్ హైవే రైడింగ్‌లో మరింత మెరుగ్గా అనిపిస్తుంది.

రెట్రో ఆకర్షణ లేదా ఆధునిక సాంకేతికత?

Yamaha XSR 155 దాని రెట్రో LED హెడ్‌లైట్, LCD డిస్‌ప్లే, VVA టెక్నాలజీ, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్ల కారణంగా క్లాసిక్ కానీ మోడ్రన్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దీని డెల్టాబాక్స్ ఫ్రేమ్ బలం రైడ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. KTM 160 Duke TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, సూపర్‌మోటో ABS, ఆఫ్-రోడ్ ABS వంటి ఫీచర్లతో పూర్తిగా మోడ్రన్ టెక్నాలజీతో వస్తుంది. ఈ బైక్ టెక్నాలజీ, స్పోర్టీ పాత్రను ఇష్టపడే రైడర్‌ల కోసం.

ఇంజిన్, పనితీరు

ఇంజిన్ విషయానికి వస్తే, Yamaha XSR 155 సీసీ ఇంజిన్ 18.4 PS శక్తి అందిస్తుంది. దాదాపు 130 km/h గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. KTM 160 Duke బైక్ 164.2cc ఇంజిన్ 19 PS శక్తిని అందిస్తుంది. వేగవంతమైన టార్క్‌కు ఇది ఫేమస్. అయితే దీని గరిష్ట వేగం దాదాపు 120 km/h ఉంటుంది. అంటే, డ్యూక్‌లో పవర్ డెలివరీ చాలా మెరుగ్గా ఉంటుంది. XSR 155 మృదువైన, నియంత్రిత పనితీరును చూపుతుంది. మీరు స్టైలిష్, తేలికైన, మైలేజ్-ఫ్రెండ్లీ, రోజువారీ సిటీలో నడిపేందుకు  సౌకర్యవంతమైన బైక్ కావాలనుకుంటే Yamaha XSR 155 మీకు సరైనది. మీరు స్పోర్టీ రైడింగ్, వేగవంతమైన టార్క్, అధునాతన సాంకేతికత కలిగిన బైక్‌ను ఇష్టపడే వారైతే KTM 160 Duke మీకు మరింత మెరుగ్గా అనిపిస్తుంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget