Mahesh Babu : లుక్ చూస్తే నందిపై 'రుద్ర' - 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేష్ బాబు... రాజమౌళి ప్లాన్ ఏంటి?
Varanasi Movie : 'వారణాసి'లో రాజమౌళి శ్రీరాముడిగా నటించనున్నట్లు దర్శక ధీరుడు రాజమౌళి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇంకా మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Mahesh Babu Role In Rajamouli Varanasi Movie : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మహేష్, రాజమౌళి మూవీ 'వారణాసి' టైటిల్‌తో పాటు బిగ్ సర్‌ప్రైజ్ గ్లింప్స్ కూడా వచ్చేసింది. ఈ మూవీలో మహేష్ రుద్రుని పాత్రలో కనిపించనున్నారు. 'వారణాసి' నగరం బ్యాక్ డ్రాప్‌లో నందిపై శివుడిలా చేతిలో త్రిశూలంతో రౌద్ర రూపంలో మహేష్ వస్తోన్న తీరు సాక్షాత్తూ శివుడే కిందకు దిగి వచ్చాడా అనేలా ఉంది.
అటు గ్లింప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖండాంతరాలను దాటి ఒకప్పటి కాశీ నగరం, అంటార్కిటికా, ఆఫ్రికా ఖండాలను టచ్ చేస్తూ, రామాయణాన్ని చూపిస్తూ... కాశీలో మణికర్ణిక ఘాట్‌ను హైలెట్ చేశారు. బీజీఎం, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈ మూవీపై హైప్ పదింతలు అయ్యింది.
శ్రీరాముడిగా మహేష్
ఈ మూవీలో మహేష్ బాబు శాంత స్వరూపిడిగా శ్రీరాముడిలా నటించారని బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. మహేష్ లుక్‌తో పాటు మూవీ గురించి 'GlobeTrotter' ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ లీక్ ఇచ్చారు. 'వారణాసిలో మహేష్ శ్రీరాముడిలా నటించారు. ఏకంగా 60 రోజులు రాముడి ఎపిసోడ్ షూట్ చేశాం. ఫస్ట్ డే ఫోటో షూట్‌లో మహేష్ బాబుని శ్రీరాముడిగా రెడీ చేసి ఫోటోలు తీశాం. అయితే, మహేష్ శ్రీకృష్ణుడి పాత్రకు బాగా సూట్ అవుతాడని అనుకున్నా. కానీ ఆ రోజు నా అంచనా తప్పని మహేష్ నిరూపించాడు.
ఆ లుక్ నా వాల్ పేపర్‌గా పెట్టుకున్నా. ఎవరైనా చూసేస్తారేమోనని అది తీసేశాను. రామాయణంలో ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మహేష్ రాముడి వేషం వేసుకుని ఫోటో షూట్ చేస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రాముడి ఎపిసోడ్ 60 రోజులు షూట్ చేశాం. రీసెంట్‌గానే అది పూర్తైంది. ఇందులో చాలా సబ్ ఎపిసోడ్స్ ఉన్నా... నేను, మహేష్ కెరీర్‌లో మర్చిపోలేని సీక్వెన్స్ అది.' అంటూ రాజమౌళి చెప్పారు.
నా డ్రీమ్ ప్రాజెక్ట్
అటు మహేష్ బాబు ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. 'నేను పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉందంటూ నాన్న తరచూ అనేవారు. ఆయన చాలాసార్లు అడిగినా నేను ఎప్పుడూ మాట వినలేదు. ఇప్పుడు నా మాటలు ఆయన వింటుంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా జీవితంలో ఒక్కసారే వచ్చే ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంతగా కష్టపడతాను. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా చేస్తా. వారణాసి రిలీజ్ అయితే ఈ మూవీ చూసి యావత్ దేశం గర్వపడుతుంది. ఇది జస్ట్ టైటిల్ ప్రకటన మాత్రమే. ఇక మున్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా.' అంటూ మరింత హైప్ క్రియేట్ చేశారు మహేష్.
లుక్ చూస్తే అలా... రాజమౌళి ప్లాన్ ఏంటి?
అయితే, అప్పుడే మహేష్ ఫస్ట్ లుక్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మూవీలో మహేష్ క్యారెక్టర్ పేరు రుద్ర. లుక్ చూస్తే నందిపై శివుడిలా వారణాసి బ్యాక్ డ్రాప్‌లో రౌద్ర రూపంలో ఉన్నట్లుగా ఉంది. గ్లింప్స్‌లో రామాయణాన్ని హైలెట్ చేశారు. మహేష్ శ్రీరాముడిలా నటించారని జక్కన్న స్వయంగా చెప్పారు. మరి వీటన్నింటికీ ఎలా లింక్ చేస్తారని చర్చించుకుంటున్నారు. రాజమౌళి ప్లాన్ ఊహకు అందడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి 2027 వేసవిలో 'వారణాసి' రూపంలో ఓ విజువల్ వండర్ చూడబోతున్నట్లు మాత్రం అర్థమవుతోంది.





















