SSMB 29 Titled as Varanasi | మహేశ్ బాబు రాజమౌళి కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ | ABP Desam
ఫ్యాన్స్ అంతా ఎన్నాళ్లూగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సినిమా కు సంబంధించి అతిపెద్ద అవైటింగ్ తో ఇవాళ్టితో ముగిసిపోయింది. ఎందుకంటే SSMB 29 కి అఫీషియల్ గా వారణాసి అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. రామోజీ ఫిలింసిటీ లో జరిగిన ఈ వెంట్ లో జక్కన్న ఈ సర్ ప్రైజ్ ఇచ్చాడు. కాశీ బ్యాక్ డ్రాప్ లో మహానందిపై మహేశ్వరుడిలా మహేశ్ బాబు వస్తుంటే అంత కంటే ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంది. కాషాయ జెండాలు రెపరెపలాడుతున్న వారణాసి టైటిల్ సాక్షిగా గ్లోబల్ లెవల్లో వారణాసి సినిమాతో మహేశ్ రాజమౌళి కాంబినేషన్ సంచలనాలు సృష్టించటం ఖాయం అనే రేంజ్ లో ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోలైతే పూనకాలు తెప్పించాయి. ఫ్యాన్స్ అయితే వారణాసి గ్లింప్స్ చూసి మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. చూడాలి ఈ సినిమా విడుదలయ్యాక ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో.




















