chinni serial today march 5th: చిన్ని సీరియల్: భార్యని మర్చిపోవడానికి మ్యాడీ కొత్త ప్రయోగం! చిన్ని ప్రయత్నాలు ఫలిస్తాయా!
chinni serial today episode march 5th మ్యాడీ చిన్నిని మర్చిపోవాలని బిజినెస్ చేయాలి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు జరిగింది అంతా స్వప్నతో చెప్పి బాధ పడుతుంది. ఇంతలో మ్యాడీ అటుగా వస్తాడు. అదిగో మ్యాడీ వచ్చాడు అని స్వప్న మాట్లాడటానికి వెళ్తుంది. నువ్వేంటి ఇక్కడ స్వప్న అని మ్యాడీ అడిగితే మధు కూడా ఉంది అని చూపిస్తుంది. దానికి మ్యాడీ మధు కాదు చిన్ని అని అంటాడు. చిన్న దగ్గరకు రా అని స్వప్న అంటే చిన్ని ఉన్న చోటుకి నేను రాను.. నా దగ్గరకు చిన్నిని రానివ్వను అని అంటాడు.
చిన్నిని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ మ్యాడీ.. చిన్నప్పటి నుంచి నీకు చిన్ని తెలుసు.. తన ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడింది అని నీకు తెలుసు.. అలాంటి చిన్ని నిన్ను ఎందుకు మోసం చేస్తుంది. చిన్నిని నువ్వు తప్పుగా అపార్థం చేసుకున్నావ్ అని అంటుంది. అవును నిజంగానే అపార్థం చేసుకున్నా తన స్నేహం తప్పుగా అర్థం చేసుకున్నా.. తన నిజస్వరూపం తెలిశాక అర్థం చేసుకున్నా.. మా మమ్మీ నన్ను శ్రేయకి పెళ్లి చేయాలి అని అనుకుందని తను అనుకోవడం కరెక్ట్ కాదని తను అర్థం చేసుకోవాలి.. ఎన్ని నిందలు మా మమ్మీ మీద వేసినా నేను నమ్మను అని తను అర్థం చేసుకోవాలి.. స్వప్న నీ మంచి కోసం చెప్తున్నా ప్రేమలో నేను ఎలాగూ మోసపోయా.. స్నేహంలో నువ్వు మోసపోకుండా జాగ్రత్త పడు అని చెప్తాడు.
చిన్ని కలవడం గురించి మ్యాడీ ఆలోచిస్తూ బాధగా ఉంటే వరుణ వచ్చి మాట్లాడుతాడు. చిన్ని గుర్తొచ్చిందా అని అడిగితే గుర్తు రావడం కాదు చాలా బాధ పెడుతుంది. తనని ఎంత ప్రేమించానో నీకు తెలుసు.. అలాంటి మనిషి అంత నమ్మకద్రోహం చేస్తే తట్టుకోలేకపోతున్నా అని అంటాడు. మర్చిపోవాలి బావ తనని ఎలా అయినా మర్చిపోవాలి.. తను నా ఎదురు పడినా సరే గుర్తు పట్టలేనంత మర్చిపోవాలి అంటాడు. అది జరగదు బావ.. మనసుకి ప్రేమించడం తెలుసు కానీ మర్చిపోవడం తెలీదు అని వరుణ్ అంటాడు. మర్చిపోతా చిన్నిని ఏలా అయినా మర్చిపోవాలి అని మ్యాడీ మమ్మీ, డాడీ అని పిలుస్తాడు. అందరూ బయటకు వస్తారు. మమ్మీ నేను అర్జెంట్‌గా చిన్నిని మర్చిపోవాలి.. నాకు డైవర్షన్ కావాలి అని అంటాడు. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నా.. మనకు చాలా బిజినెస్‌లు ఉన్నాయి కదా ఏదో ఒకటి చూసుకుంటా అంటాడు. నీ చదువు పూర్తవ్వలేదు కదా అని దేవా అంటే ఆ కాలేజ్‌కి వెళ్లడం నా వల్ల కాదు అని మ్యాడీ అంటాడు.
డాడీ నేను బిజినెస్ చూసుకుంటా అని అంటాడు. చదువు మానేసి బిజినెస్‌లోకి వస్తా అన్నాడు అంటే ఆ చిన్ని ఎంత డిస్ట్రబ్ చేసిందో ఆలోచించు బావ.. 24 గంటలు వీడు బిజినెస్‌లో మునిగిపోతే చిన్నిని మర్చిపోతాడు.. అని అంటుంది. దేవా సరే అని ఓ టెక్స్‌టైల్స్ బిజినెస్ చూసుకోమని చెప్తాడు. మ్యాడీ తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్తాడు. శ్రేయ బాధ పడుతుంటే లోహిత వెళ్లి ఎందుకు బాధ పడుతున్నావ్ అంటే నేను ప్రేమించిన బావ ఫారెన్ వెళ్లిపోతా అంటున్నాడు.. పెళ్లి వాళ్లు నా గురించి బావ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. అత్తయ్యా నాకు వేరే సంబంధం చూస్తానని అంటుంది. అత్తయ్యా వేరే సంబంధాలు చూడకపోయినా ఆ చిన్నినే చూసేలా ఉంది అని అంటుంది.
లోహిత శ్రేయతో మీ అత్తయ్యా ప్లాన్ నీకు అర్థం కాలేదా.. వచ్చిన వాళ్లు నిజంగా పెళ్లి వాళ్లు కాదు. వాళ్లు పెయిడ్ ఆర్టిస్ట్‌లు.. పెళ్లి వాళ్ల చేత అలా అనిపించి తప్పక మ్యాడీ నిన్ను పెళ్లి చేసుకునేలా చేయడం మీ అత్తయ్యా ప్లాన్.. చిన్ని వల్ల ఆ ప్లాన్ మిస్ అయింది. ఈ ప్లాన్ పోయినా మీ అత్తయ్యా మరో ప్లాన్ చేస్తుంది. ఏం ఫీలవ్వొద్దు అని అంటుంది. అత్తయ్యాని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నా అని శ్రేయ బాధ పడుతుంది.
చిన్ని ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటుంది. నేను మ్యాడీ చిన్ని, మహి అని తెలియకముందు నీ దగ్గర చాలా సార్లు కలిశాం.. మొదటి సారి మ్యాడీనే మహి అని తెలిసింది కూడా నీ దగ్గరే.. నన్ను ఎందుకు మ్యాడీకి దూరం చేశావ్ స్వామి అని అంటుంది. మ్యాడీ ఆఫీస్‌కి వెళ్లడానికి రెడీ అయి ఆంజనేయ స్వామి దగ్గరకు ప్రమీలతో కలిసి వస్తాడు. మ్యాడీ నేను కలిసిపోవాలని చిన్ని కోరుకుంటుంది. మ్యాడీ, చిన్ని కలిసిపోవాలని ప్రమీల కోరుకుంటుంది. చిన్ని ఎప్పటికీ గుర్తు రాకూడదు అని మ్యాడీ కోరుకుంటాడు. ఇక మ్యాడీ అక్కడే నిమ్మకాయ దీపం చూసి చిన్ని ఇక్కడికి వచ్చిందన్నమాట అని అనుకొని ప్రమీలకు చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























