MM Keeravani Speech Varanasi SSMB 29 | పోకిరీ డైలాగ్ ను పేరడీ చేసి అదరగొట్టిన కీరవాణి | ABP Desam
SSMB 29 సినిమా అప్డేట్స్ తో RFC దద్దరిల్లిపోయింది. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా జంటగా వస్తున్న SSMB 29 పేరు వారణాసిగా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ అన్మౌన్మెంట్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పోకిరి సినిమాను డైలాగ్ భలే ప్యారడీ చేసి చెప్పారు. సూపర్ స్టార్ మహేశ్ అభిమానుల గుండెల్లో పర్మినెంట్ ఫ్లాట్ ఒకటి కొన్నా. ప్రొడ్యూసర్ హ్యాపీ.డైరెక్టర్ హ్యాపీ...టైల్స్ కూడా వేస్తున్నారు. మెలోడీ నాదే..బీటూ నాదే. 2027 సమ్మర్ లో గృహ ప్రవేశం అంటూ వారణాసి సినిమా 2027 సమ్మర్ లో రిలీజ్ అవుతోందని బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు కీరవాణి.వారణాసి సినిమా అన్మౌన్స్మెంట్ గ్రాండ్ గా జరిగింది. SSMB 29 అంటూ ఇన్నాళ్లూ ఉన్న పేరు కాస్తా ఇకపై వారణాసి అని అఫీషియల్ అయిపోయింది. వారణాసిలో రుద్రగా మహేశ్ బాబు త్రిశూలం చేతబట్టి నందిపై వస్తున్నట్లు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. దీంతో పాటు వారణాసి కథ కాన్సెప్ట్ ఏంటో హింట్ ఇచ్చేలా ఓ కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. అభిమానులైతే మ్యాడ్ అయిపోయారు అంతే.





















