India vs South Africa | కోల్‌కత్తా టెస్టులో బుమ్రా అదిరిపోయే పర్ఫామెన్స్
ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో... మొదటి ఇన్నింగ్స్‌లోనే దక్షిణాఫ్రికా 159 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. ఇక స్వదేశంలో శుబ్మన్ గిల్ కెప్టెన్ గా ఇదే తోలి టెస్ట్ సిరీస్ కావడం విశేషం. కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ ఐడెన్ మార్‌క్రమ్, రియాన్ రికెల్టన్ 57 పరుగుల భాగస్వామ్యం తర్వాత సఫారీల పతనం మొదలయింది. మార్‌క్రమ్ 31, రికెల్టన్ 23 పరుగులు చేసి ఔటయ్యారు. టెంబా బావుమా కేవలం 3 పరుగులు చేసి ఔటయ్యారు. టోనీ డి జోర్జీ 55 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇక జస్ప్రీత్ బుమ్రా 14 ఓవర్లు బౌలింగ్ చేసి, కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ సఫారీలను దెబ్బకొట్టారు. టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తుంది. దాంతో భారీ స్కోర్ దిశగా టీమ్ ఇండియా టార్గెట్ ఉంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.





















