అన్వేషించండి
Anupama Parameswaran: తెలుగులోకి అనుపమా పరమేశ్వరన్ సూపర్ హిట్ మలయాళం కోర్టు రూమ్ డ్రామా
తెలుగులోనూ పాపులర్ అయిన మలయాళ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. 'ప్రేమమ్' తర్వాత నుంచి ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరోవైపు మాతృభాష మలయాళంలోనూ నటిస్తున్నారు.

అనుపమా పరమేశ్వరన్
1/4

అనుపమా పరమేశ్వరన్ మలయాళీ హీరోయిన్. అయితే... తెలుగులోనూ ఆవిడ చాలా పాపులర్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఆమె నటిస్తున్నారు. ఆవిడ నటించిన మలయాళ సినిమా ఒకటి ఇప్పుడు తెలుగులోకి వస్తోంది.
2/4

మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ప్రవీణ్ నారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా రూపొందుతోంది.
3/4

వాస్తవ సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్పథ కోణంలో తీసిన ఈ సినిమాలో బైజు సంతోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్ళై, అస్గర్ అలీ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రాన్ని తెరకెక్కించారు.
4/4

'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాలో జానకిగా అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో జానకి ఎలా ఎదుర్కొంది? అనే అంశంతో రూపొందిన చిత్రమిది. జానకి కేసును వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి నటించారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సేతురామన్, హుమాయున్ అలీ అహమ్మద్ సహ నిర్మాతలు
Published at : 21 Dec 2024 12:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion