Emoji OTT Release Date: తెలుగులోకి రొమాంటిక్ యూత్ వెబ్ సిరీస్ - ఆ ఓటీటీలోకి 'ఎమోజీ' స్ట్రీమింగ్, ఎప్పటి నుంచో తెలుసా?
Emoji OTT Platform: 2022లో తమిళంలో మంచి విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'ఎమోజీ' తాజాగా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 28 నుంచి 'ఆహా'లో రానుంది.

Mahath Raghavendra's Emoji Web Series OTT Release On Aha: హారర్, క్రైమ్, లవ్, కామెడీ ఎంటర్‌టైనర్స్ ఏదైనా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు మంచిగా ఆదరిస్తారు. తమిళం, మలయాళ భాషల్లోని అలాంటి జానర్లలో చాలా వెబ్ సిరీస్‌లు, మూవీలు ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవ్వుతున్నాయి. తాజాగా, అలాంటి వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ముందుకొస్తోంది. 2022లో రొమాంటిక్ కామెడీ జోనర్లో తమిళంలో రిలీజైన 'ఎమోజీ' (Emoji) సిరీస్ లేటెస్ట్‌గా తెలుగు ఆడియన్స్‌కు అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌లో మహత్ రాఘవేంద్ర (Mahath Raghavendra), మానసా చౌదరి (maanasa choudhary), దేవిక కీలక పాత్రలు పోషించారు. సెన్ రంగసామీ దర్శకత్వం వహించగా.. సంపత్ నిర్మించారు. తమిళంలో ఈ సిరీస్ మంచి విజయం సాధించింది. ఈ నెల 28 నుంచి తెలుగులో 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'మసకబారడానికి చాలా బలమైన ప్రేమ, ఎడబాటు భరించలేని బాధాకరమైనది! ప్రేమ గెలుస్తుందా?'. అంటూ పేర్కొంది.
View this post on Instagram
ఈ సిరీస్ కథేంటంటే.?
ప్రేమలో ఉన్న ఓ యువతీ యువకుడు కొన్ని ఘటనలతో ఆమెకు దూరమవుతాడు. జీవితంలో మరో అమ్మాయితో ముందుకెళ్లాలని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులేస్తాడు. ఇదే సమయంలో అతనితో విడిపోయిన ప్రియురాలు అతని జీవితంలోకి మళ్లీ వస్తుంది. అందుకు గల కారణాలేంటి.? తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. మోడ్రన్ డే రిలేషన్స్ బ్యాక్ డ్రాప్‌లో.. ప్రేమ, పెళ్లి, బ్రేకప్‌ల విషయంలో నేటి యువత ఆలోచనలు, అభిప్రాయాలను దర్శకుడు కాస్త రొమాంటిక్ యాంగిల్‌లో చూపించారు.
ఈ సిరీస్ హీరో మహత్ రాఘవేంద్ర తెలుగు, తమిళ భాషల్లో 20కి పైగా సినిమాలు చేశారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, సైకిల్ మూవీలతో ఇంకొన్ని సినిమాలు చేశారు. తమిళంలో చిన్న సినిమాల్లో హీరోగా చేస్తూనే.. జిల్లా, మానాడు వంటి మూవీల్లో కీలక పాత్రలు పోషించారు. తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొనడమే కాకుండా.. బిగ్ బాస్ సీజన్ 3, 4 సహా హిందీ బిగ్ బాస్ సీజన్ 16ల్లోనూ సందడి చేశారు. ఇక, హీరోయిన మానసా చౌదరి.. బబుల్ గమ్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సుమ కనకాల కొడుకు రోషన్ నటించిన ఈ మూవీ కాస్త పర్వాలేదనిపించింది. అలాగే, దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్‌లో మానస ఓ కీలక పాత్ర పోషించారు.
Also Read: ‘బాలయ్య బాబు ప్రసాదం.. చాలా ఫన్ ఉంది’.. సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ ఎలా ఉందంటే?





















