South Actress: చిరు, కమల్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి
కమల్ హాసన్, చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్ హీరోలతో ఏకంగా 700 సినిమాలు చేసింది ఈ హీరోయిన్. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మందుకు బానిసై ఆమె కెరీర్ పట్టాలు తప్పింది. వివాహిక బంధంలోనూ కష్టాలే...

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు మంచి స్టార్ డమ్ సంపాదించుకుని ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఆ స్టార్ డమ్ ను కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఇంకా కొంతమంది స్టార్ స్టేటస్ వచ్చాక వ్యసనాలకు బానిసై జీవితాలను, కెరీర్ ను నాశనం చేసుకుంటారు. ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటి ఊర్వశి కూడా తన కెరీర్ ను ఇలాగే నాశనం చేసుకుంది.
తాగుడుకు బానిసై కెరీర్
మలయాళంతో పాటు కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి నటిగా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న ఊర్వశి ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. టాలీవుడ్ లోని ప్రముఖ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఆమె కెరీర్ మద్యపానం వ్యసనం కారణంగా పట్టాలు తప్పింది.
కేరళలోని కొల్లం జిల్లాలో జన్మించింది ఊర్వశి. ఆమె అసలు పేరు కవిత రేంజిని. బాలనటిగా ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఊర్వశి, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట్లో ఊర్వశికి తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. 1984లో చిరంజీవితో కలిసి 'రుస్తుం' అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. 1985లో బాలకృష్ణతో 'భలే తమ్ముడు' అనే సినిమాలో నటించిన ఈ అమ్మడు, అలాగే 1987లో 'న్యూఢిల్లీ' అనే హిందీ సినిమాలో నటించింది. అలా మొదలైన ఆమె సినీ ప్రయాణం 2006లో ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును అందుకునే రేంజ్ కు ఎదిగింది. ఊర్వశి తన కెరీర్లో సుమారు 700 సినిమాలలో నటించింది. అందులో చాలా వరకు హీరోయిన్ గా నటిస్తే, కొన్ని సినిమాల్లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించింది.
ఇక ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్, అంబరీష్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి దిగ్గజ నటీనటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. కెరీర్ మొదట్లోనే స్టార్ డమ్ సాధించినప్పటికీ, ఊర్వశి తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఎన్నో సమస్యల్లో పడింది. తన పర్సనల్ లైఫ్ లో కష్టాలను కూడా ఎదుర్కొంది. అలాంటి టైమ్ లో ఆమె మద్యపాన వ్యసనం కారణంగా సినీ కెరీర్ పై దెబ్బ పడింది అనే వార్త ప్రచారంలో ఉంది.
44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి
2007లో ఊర్వశి నటుడు మనోజ్ కె విజయన్ ను వివాహం చేసుకుంది. కానీ ఈ జంట వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. భర్తతో విడాకులు తీసుకుని, సింగిల్ మదర్ గా కొనసాగింది. 2016లో 44 సంవత్సరాల వయసులో ఊర్వశి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శివప్రసాద్ ను రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్తతో కూతురు పుట్టగా, రెండవ భర్తతో ఇహన్ ప్రజాపతి అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం ఊర్వశి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపా దడపా సినిమాలు చేసుకుంటూ, తన కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

