Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Teacher Jobs | విద్యా హక్కు చట్టం కింద భాషా ప్రాతిపదిక మీద షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలు జరపాలి ఆదివాసీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం సిఎం రేవంత్ రెడ్డి ని కలిసి కోరింది.

సిఎం రేవంత్ రెడ్డి ని కలిసి కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం
Revanth Reddy News | హైదరాబాద్ : షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల నియామకానికి సంబందించిన జి. ఓ.3 ని సుప్రీం కోర్టు కొట్టివేయడంతో షెడ్యూల్డ్ ఏరియాలోని ఆదివాసి గిరిజన నిరుద్యోగుల పరిస్థితి అగమ్య గొచరంగా తయారైంది. జి.ఓ.3కి బదులుగా విద్యా హక్కు చట్టం కింద భాషా ప్రాతిపదిక మీద ఉద్యోగ,ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి. అవి కూడా ఐటిడిఎ ద్వారా చేపట్టాలని మంత్రి సీతక్క నాయకత్వంలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, కోరం కనకయ్య, కడాడి నారాయణ, పాయం వెంకటేశ్వర్లు, ఆదివాసీ ప్రొఫెసర్లు చిదం కిషోర్, డాక్టర్ అనురాధ, జి. వెంకట రమణ, డాక్టర్ పద్మజ తదితరులతో కూడిన ప్రతినిధి బృదం శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి కోరారు.
ఆదివాసి తెగలకు న్యాయం
భాషా ప్రతిపదికన నియామకాలు జరిగితే గోండు, కోలాం, మన్నెవార్, నాయకపోడ్, కోయ తదితర ఆదివాసి తెగలకు న్యాయం జరుగడమే కాకుండా ఆయా తెగల విద్యార్థులకు కూడ గుణాత్మక విద్య అందుతుందని ప్రతినిధి బృదం సీఎం దృష్టికి తీసుకెళ్ళింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. భాషా ప్రాతిపదిక మీద నియామకాలు చేపట్టే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సూచించారు. ఆదివాసుల్లో ఐఎఎస్, ఐపిఎస్ అధికారులే లేరని విద్యా వంతులైన యువత సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారికి సదుపాయాలు లేకపోవడంతో వెనుకడుగు వేసే పరిస్థితి ఉంది.
హైదరాబాద్ లో ఆదివాసుల కోసం ప్రత్యేకంగా ఐఎఎస్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేకంగా యువకులకు నాలుగు, యువతులకు నాలుగు హాస్టళ్ళు ఏర్పాటు చేయాలని, గ్రూప్ పరీక్షలకు సిద్ధమౌవుతున్న అభ్యర్థులకు భోజన, వసతి సౌకార్యాలు ఏర్పాటు చేయాలని వారు కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఇండ్లు ఆదివాసులందరికి అందె విధంగా ఐటిడిఎ లకు ప్రత్యేక కోటా మంజూరు చేయాలని కోరగా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు.
Also Read: Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

