APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP Desam
గ్రూప్ 2 పరీక్షను యధాతథంగా నిర్వహిస్తున్నట్లు APPSC క్లారిటీ ఇచ్చింది. రోస్టర్ విధానంలో తప్పుల కారణంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఆపాలని సీఎం చంద్రబాబు తరపున ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసినా APPSC ఛైర్ పర్సన్ అనురాధా అందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. MLC కోడ్ అమలులో ఉన్నందున గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు మేలు చేకూర్చేలాంటి ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించమన్న ఛైర్ పర్సన్ అనురాధా పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వానికి తిరిగి లేఖ రాశారు. పైగా గ్రూప్ 2 పరీక్ష రద్దు అంటూ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ లో ఏపీపీఎస్సీ సెక్రటరీ కేసు పెట్టారు. ఏపీపీఎస్సీ నిర్ణయంతో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. సాయంత్రం నుంచి ఎక్కడిక్కడ ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులు వైజాగ్ ఇసుకతోట దగ్గర నేషనల్ హైవే పై ఆందోళనకు దిగారు. అభ్యర్థుల ఆందోళన దగ్గర పరీక్షా కేంద్రాల దగ్గర పోలీసులు భద్రతను పెంచారు.





















