అన్వేషించండి

Kamala Harris: బైడెన్ ను దెబ్బతీసిన ప్లాన్‌తోనే డొనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టిన కమలా హారిస్

Donald Trump | రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఇరుకున పెట్టేందుకు డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ సరికొత్త ప్లాన్ వేశారు. తన ఆరోగ్య నివేదిక విడుదల చేసి ట్రంప్ ఆరోగ్యాన్ని సవాల్ చేశారు.

Kamala Harris excellent health report  | వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. యూఎస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తించేందుకు ఆమె ఫిట్‌గా ఉన్నారని డాక్టర్  జాషువా సిమన్స్‌ తెలిపారు. అగ్రరాజ్యం అమెరికా దేశాధ్యక్షురాలిగా సేవలు అందించేందుకు కమలా హారిస్ శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉన్నట్లు ఆమె డాక్టర్ చెబుతున్నారు. కమలా హారిస్‌ ప్రస్తుత ఆరోగ్య స్థితి, మెడికల్‌ హిస్టరీకి సంబంధించిన లేఖను తాజాగా విడుదల చేశారు. ఈ లెటర్ విడుదల వెనుక పెద్ద కారణమే ఉందని అమెరికాలో చర్చ జరుగుతోంది.

యూఎస్‌ ఆర్మీ కర్నల్‌, డాక్టర్‌ సిమన్స్‌ గత మూడేళ్లకు పైగా కమలా హారిస్‌కు వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం కమలా హారిస్ మానసికంగానూ, శారీరకంగానూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, ఆమె జీవన శైలిని బావుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అధ్యక్షురాలిగా సేవలు అందించేందుకు హారిస్ కు ఏ ఇబ్బంది లేదని చెప్పారు. అయితే చిన్న అనారోగ్య సమస్య మాత్రం ఉందన్నారు. కమలా హారిస్‌కు అలర్జీ సమస్య ఉందని, దీని కోసం ఆమె చికిత్స తీసుకుంటున్నారని సైతం ఆమె డాక్టర్ వెల్లడించారు. 

హారిస్ హెల్త్ లెటర్ రిలీజ్ వెనుక కారణం అదేనా?
డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆరోగ్యం, ఫిట్ నెస్ సంబంధిత లేఖను విడుదల చేయడం వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలం నుంచి తన హెల్త్ అప్ డేట్ వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించడం లేదు. గతంలో ట్రంప్ తన ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టులు అసంపూర్తిగానే విడుదల చేసేవారు. ఈ ఏడాది జులైలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరగడం తెలిసిందే. ట్రంప్ చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ తరువాత నుంచైనా ట్రంప్ తన హెల్త్, ఫిట్ నెస్ అప్ డేట్ అసంపూర్తిగానే ఇచ్చారు. దీన్నే ఇప్పుడు కమలా హారిస్ తన ప్రచార అస్త్రంగా వాడనున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ సైతం అనారోగ్యం, ఫిట్ నెస్ సమస్య కారణంగానే ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారని తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయసు 81 ఏళ్లు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ వయసు 78 ఏళ్లు కాగా. కమలా హారిస్ వయసు 59 ఏళ్లు. కాగా, జో బైడెన్ అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన సమయలో ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఫిట్ నెస్ కూడా లేని వ్యక్తి అంటూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. 
Also Read: ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు

అయితే గత కొన్నేళ్ల నుంచి తన ఆరోగ్యం గురించి ట్రంప్ అసంపూర్తిగా సమాచారం ఇస్తున్నారని, ఇదే విషయంలో మాజీ అధ్యక్షుడికి చెక్ పెట్టాలని కమలా హారిస్ టీమ్ భావిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షురాలిగా సేవలు అందించేందుకు మానసికంగా, శారీరకంగానూ హారిస్ ఫిట్ గా ఉన్నారని మెడికల్ రిపోర్ట్ విడుదల చేసి ట్రంప్ ను ఇరుకున పెట్టారు. కొన్ని నెలల కిందట బైడెన్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేసిన ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, మరో నాలుగుదైళ్లు ఆయన యాక్టివ్ గా ఉంటే అవకాశం ఉందా అని అమెరికాలో చర్చ మొలైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget