(Source: ECI/ABP News/ABP Majha)
Iran Israel Crisis: ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు
Israel Iran Crisis | ఇటీవల ఇజ్రాయెల్ పై ఇరాన్ గగనతలం నుంచి క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా, ఇరాన్ పై ఆంక్షలు మరింత విస్తరించింది.
US Expands sanctions on Irans oil sector over missile attack on Israel | వాషింగ్టన్: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం పశ్చిమాసియాతో పాటు పలు దేశాలపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై అమెరికా తన ఆంక్షలు విస్తరించింది. బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఇటీవల దాడి చేసింది. ఆ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కు చెందిన పెట్రోలియంపై ఆంక్షలు విధించినట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా తాజా నిర్ణయంతో ఇరాన్ కు మూలిగే నక్క మీద ఏదో పడ్డట్లు అయింది.
ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో దాడి
టెహ్రాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్యతో పాటు బీరుట్‌లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా ఇజ్రాయెల్ కు నిధులు సమకూర్చుతోంది. మరోవైపు ఇరాన్ కు చెందిన పెట్రోలియం సంస్థలు, ఆయిల్ విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 16 ఇరాన్ సంస్థలను, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించింది. ఇవి ఇరాన్ ఆయిల్ కంపెనీకి మద్దతుగా పెట్రోలియం ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తులను రవాణా చేస్తున్నాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.
హిజ్బుల్లా చీఫ్ హతమైనట్లు ప్రకటించిన ఇజ్రాయెల్
తాము చేసిన దాడుల్లో హెజ్బుల్లా అధినేత నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ఇటీవల ప్రకటించింది. ఓవైపు హమాస్ తీవ్రవాదులతో పోరాడుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ మరోవైపు లెబనాన్ లో హిజ్బుల్లాను ఎదుర్కోంటోంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఇరాన్ పై దాడులు చేసి తీవ్ర నష్టాన్ని కలిగించింది. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ అక్టోబర్ 8న యుద్ధాన్ని మొదలుపెట్టింది. వీలు చిక్కినప్పుడల్లా ఇజ్రాయెల్ సైన్యం తమ సత్తా చాటుతూ వస్తోంది. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను అంతం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు.
ఇరాన్ చమురు, అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తాయని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే ఇరాన్‌పై దాడికి ప్రత్యమ్నాయంగా ఏదైనా ఆర్థిక ప్రయోజనాల్ని దెబ్బతీసేలా ఆలోచించాలని అమెరికా అధ్యక్షుడు సూచించాడు. ఈ క్రమంలో ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై అమెరికా ఆంక్షలను మరింత విస్తరించి ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తోంది.
Also Read: Lebanon: బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు - 22 మంది మృతి, వందమందికిపైగా గాయాలు
బీరుట్‌లోని అపార్ట్‌మెంట్లపై ఇరాన్ బాంబులు వర్షం కురిపించడంతో 22 మంది మృతి చెందగా, మరో 117 మంది అమాయకులు గాయపడ్డారు. వేరే చోట జరిగిన దాడులకు ఇళ్లు ఖాళీ చేసి ఇక్కడి నుంచి జీవిస్తుండగా.. మరో దాడిలో వాళ్లు ప్రాణాలు కోల్పోయారు.