అన్వేషించండి

Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు

Miss Universe: డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ విశ్వ సుందరిగా నిలిచారు. మిస్ యూనివర్స్ 2023 విజేత షెన్నిస్ పలాసియోస్ ఆమెకు కిరీటాన్ని అందజేశారు.

Victoria Kjaer Theilvig Won Miss Universe 2024: ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో మిస్ యూనివర్స్‌కు ఉన్న క్రేజే వేరు. తాజాగా జరిగిన పోటీల్లో డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ (Kjaer Theilvig) గెలుపొంది విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. దాదాపు 125 మంది పోటీల్లో పాల్గొన్నారు. మెక్సికో వేదికగా జరిగిన పోటీల్లో 125 మంది పోటీ పడగా.. 21 ఏళ్ల విక్టోరియా కెజార్ కిరీటం అందుకున్నారు. మిస్ యూనివర్స్ 73వ ఎడిషన్ పోటీల్లో విజేతగా నిలిచిన విక్టోరియాకు 2023 మిస్ యూనివర్స్ షెన్నిస్ పలాసియోస్ విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించింది. నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, మెక్సికో చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్.. మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. 'కొత్త శకం మొదలైంది. 73వ విశ్వ సుందరిగా గెలుపొందినందుకు అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాం.' అని మిస్ యూనివర్స్ టీమ్ పేర్కొంది. ఆమెకు ఫ్యాషన్ ప్రియులు అభినందనలు తెలిపారు. మరోవైపు, ఈ పోటీల్లో భారత్ తరఫున రియా సింఘా పాల్గొన్నారు. టాప్ 5లోనూ ఆమె నిలవలేకపోయారు.

తొలి డెన్మార్క్ భామగా..

విశ్వ సుందరి కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామగా విక్టోరియా అరుదైన ఘనత సాధించారు. 2004లో సోబోర్గ్‌లో జన్మించిన ఆమె బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పొంది వ్యాపారవేత్తగా మారారు. డ్యాన్సులోనూ శిక్షణ తీసుకున్నారు. మానసిక ఆరోగ్యం, మూగజీవాల సంరక్షణ వంటి విషయాలపై పోరాటం చేస్తున్నారు. అందాల పోటీల్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో మోడలింగ్ రంగంలోకి వచ్చారు. మిస్ డెన్మార్క్‌గా తొలిసారి విజయాన్ని అందుకున్నారు. 2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20లో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు.

Also Read: Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Embed widget