Farmer Protest Tractor March: పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మార్చ్.. రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతం

సాగు చట్టాలపై రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నారు. పార్లమెంట్ వరకు కవాతు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతులకు పిలుపునిచ్చింది.

FOLLOW US: 

కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా ఉద్యమిస్తోన్న రైతులు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు. ఆందోళనలకు ఏడాది గడిచిన గుర్తుగా పార్లమెంట్ వరకు రైతులు కవాతు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్) పిలుపునిచ్చింది.

500 మంది రైతులు ఈ ఆందోళనలో పాల్గొంటారని ఎస్‌కేఎమ్ తెలిపింది. శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిరోజు పార్లమెంట్ వరకు ట్రాక్టర్‌ మార్చ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరపాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీ) సిఫార్సు చేసింది.

సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న నిరసనలకు నవంబర్ 26తో ఏడాది పూర్తవుతుంది. ఆ తరువాతే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనుండటంతో ఈ ట్రాక్టర్ మార్చ్‌కు రైతులు పిలుపునిచ్చారు. వీటితో పాటు రైతులు ఆయా రాష్ట్ర సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేయాలని తెలిపింది.

హెచ్చరిక..

నవంబర్ 26లోపు ఈ మూడు సాగు చట్టాలను రద్దు చేయకపోతే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఇటీవల బీకేయూ నేత రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. 

ఒక వేళ ఈ డెడ్‌లైన్‌ లోపు మూడు సాగు చట్టాలను ప్రభుత్వం రద్దు చేయకపోతే నవంబర్ 27 నుంచి దిల్లీ సరిహద్దుల వైపు రైతులు కదం తొక్కుతారని టికాయత్ అన్నారు. దిల్లీ పోలీసులు పీకేసిన టెంట్లను మళ్లీ రైతులు ఏర్పాటు చేస్తారని హెచ్చరించారు.

గత ఏడాది నవంబర్ నుంచి పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల రైతులు కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయం, తమ భూములు కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల భయాలను కేంద్రం తోసిపుచ్చింది. రైతులతో ఇప్పటికే పలు దఫాల చర్చలు సాగినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి.

Also Read: Padma Awards 2021: పండ్ల వ్యాపారికి పద్మశ్రీ.. వాట్‌ ఏన్ ఐడియా బాబాయ్.. నీకు 'దేశం' సలాం!

Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!

Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!

Also Read: SBI Video Life Certificate: ఎస్‌బీఐ అద్భుత సర్వీస్‌..! వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌

Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు

Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Nov 2021 08:52 PM (IST) Tags: parliament Farmers Protest Rakesh Tikait Delhi Borders SKM Samyukta Kisan Morcha

సంబంధిత కథనాలు

Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం

Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం

Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!

Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!

J&K Terrorists: ఈ ఊరి వాళ్ల ధైర్యం చూశారా, మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టులనే పట్టుకుని బంధించారు

J&K Terrorists: ఈ ఊరి వాళ్ల ధైర్యం చూశారా, మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టులనే పట్టుకుని బంధించారు

Piyush Goyal On CM KCR : తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ - కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Piyush Goyal On CM KCR : తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ - కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Single-Use Plastic Ban: ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్‌టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి

Single-Use Plastic Ban: ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్‌టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి

టాప్ స్టోరీస్

BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

IND vs ENG 5th Test Day 3: కమ్‌బ్యాక్ ఇచ్చిన ఇంగ్లండ్ - చెలరేగుతున్న బెయిర్‌స్టో - లంచ్ సమయానికి ఎంత కొట్టారంటే?

IND vs ENG 5th Test Day 3: కమ్‌బ్యాక్ ఇచ్చిన ఇంగ్లండ్ - చెలరేగుతున్న బెయిర్‌స్టో - లంచ్ సమయానికి ఎంత కొట్టారంటే?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!