By: ABP Desam | Updated at : 07 Nov 2021 06:11 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎస్‌బీఐ
పింఛన్‌దారుల కోసం ఎస్‌బీఐ ఓ అద్భుతమైన సేవను ప్రకటించింది. 'వీడియో లైఫ్ సర్టిఫికెట్' సౌకర్యం కల్పించింది. ఈ ఆప్షన్ ఉపయోగించుకొని పింఛన్‌దారులు వీడియో ద్వారా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు. అయితే ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకొనే వాళ్లకు ఈ ఫీచర్ ఉపయోగపడదని ఎస్‌బీఐ తెలిపింది. వీడియో ప్రక్రియ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను ఉచితంగానే సమర్పించొచ్చని వెల్లడించింది.
'ఇప్పుడు ఇంటి దగ్గర్నుంచే లైఫ్ సర్టిఫికెట్‌ను సబ్‌మిట్ చేయండి! 2021, నవంబర్ 1న మా వీడియో లైఫ్ సర్టిఫికెట్ సర్వీస్‌ను ఆరభించాం. సులభంగా వీడియో కాల్ చేసి జీవినపత్రం సమర్పించొచ్చు' అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. పింఛనుదారులు, కుటుంబ పింఛనుదారులు నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించడం అత్యంత కీలకం. లేదంటే వారికి పింఛను ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.
ఎస్‌బీఐలో మీకు పింఛన్ ఖాతా ఉంటే వీడియో ప్రక్రియ ద్వారా సులభంగా జీవన పత్రం సమర్పించొచ్చు. ఈ విధానాన్ని ట్వీట్లో స్పష్టంగా వివరించారు.
ఇలా సబ్మిట్ చేయండి
* మొదట www.pensionseva.sbiకి లాగిన్ అవ్వాలి.
* వీడియో లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియ మొదలు పెట్టేందుకు వీడియో ఎల్‌సీపై క్లిక్ చేయాలి.
* ఎస్‌బీఐ పింఛన్ ఖాతా నంబర్ ఎంటర్ చేయాలి.
* మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆధార్‌తో పాటు దానిని ఎంటర్‌చేసి సబ్‌మిట్ చేయాలి.
* ఆడియో, వీడియో, కెమేరా యాక్సెస్ ఇవ్వాలని కోరుకుతుంది. 'స్టార్ట్ జర్నీ'ని క్లిక్ చేయాలి.
* మీ పాన్ కార్డును సిద్ధంగా ఉంచుకొని 'ఐయామ్ రెడీ'పై క్లిక్ చేయాలి.
* వీడియో కాల్ పర్మిషన్ అడుగుతుంది. అనుమతి ఇవ్వాలి. ఎస్‌బీఐ అధికారి మీతో మాట్లాడతాడు.
* మీ స్క్రీన్‌పై కనిపించిన నాలుగు అంకెల వెరిఫికేషన్‌ను చదవాలి.
* అధికారి అడగ్గానే మీ పాన్ చూపించాలి.
* బ్యాంకు అధికారి మీ ఫొటో తీసుకొని లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియ ముగిస్తారు.
Now submit your #LifeCertificate from the comfort of your home! Our #VideoLifeCertificate service launching on 𝟏𝐬𝐭 𝐍𝐨𝐯 𝟐𝟎𝟐𝟏 will allow pensioners to submit their life certificates through a simple video call.#SBI #Pensioner #AzadiKaAmritMahotsav #AmritMahotsav pic.twitter.com/SsyJjnCPlL
— State Bank of India (@TheOfficialSBI) October 29, 2021Also Read: Provident Funds: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?
Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్మెంట్ తెచ్చిన ఐటీ శాఖ
Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి
Also Read: Whatsapp New Feature: ఇంటర్ నెట్ అవసరం లేకుండానే వాట్సాప్ వాడుకోవచ్చు.. అద్భుతమైన నయా ఫీచర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Gold-Silver Price 31 January 2023: ₹58k వైపు పసిడి పరుగులు, తెలీకుండానే చల్లగా పెరుగుతోంది
UAN Number: మీ యూఏఎన్ నంబర్ మర్చిపోయారా, ఒక్క నిమిషంలో తెలుసుకోండి
Recurring Deposit: రికరింగ్ డిపాజిట్లో ఎక్కువ డబ్బు పొందాలంటే ఎలా?
Budget 2023: సుకన్య సమృద్ధికి బడ్జెట్లో బూస్ట్ - అలాంటి వారికీ ఛాన్స్ ఇస్తారట!
Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?