RIL Official Statement: అంబానీ ఫ్యామిలీ లండన్‌కు షిప్టు అయిపోతుందా.. లండన్‌లో ప్యాలెస్ ఎందుకు కొన్నట్టు.. దీనిపై రిలయన్స్ రియాక్షన్ ఏంటి?
రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ ఫ్యామిలీ లండన్‌లో సెటిల్ అవుతారా. లండన్‌లో భారీ ప్యాలెస్‌ను కొనుక్కున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంత వరకు కరెక్టు.
ముకేష్ అంబానీ ఫ్యామిలీ తన కుటుంబం కోసం పెద్ద ప్యాలెస్‌ను బ్రిటన్‌లో రెడీ చేసినట్టు మిడ్‌డే వార్తా సంస్థ వేసిన స్టోరీ సంచలనంగా మారింది. లండన్‌లో బకింగ్‌హాం షైర్ వద్ద మూడు వందల ఎకరాల్లో స్టోక్ పార్క్ కొనుగోలు చేసినట్టు ఆ వార్త సారాంశం. 2021 మొదట్లో సుమారు ఆరు వందల కోట్లతో కొనుగోలు చేసిన ఈ ఆస్తిని తన అవసరాలకు అనుగుణఁగా అంబానీలు మార్చుకుంటున్నారని పేర్కొంది. 49 బెడ్ రూమ్స్ ఉన్న ఆ భవంతిలోనే ఈ దీపావళి కూడా జరుపుకున్నారని తెలిపింది.
మిడ్‌డే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంబానీ ఫ్యామిలీ లండన్ వెళ్లిపోతుందని... తన నివాసాన్ని మార్చుకుంటుందని సోషల్ మీడియా ఒక్కసారిగా గుప్పుమంది. ఈ ప్రచారంపై రిలయన్స్ సంస్థ ఓ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ముకేష్ అంబానీ ఫ్యామిలీ ముంబయిలోనే ఉంటారని... మకాం మార్చే ఆలోచన లేదని... జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. బ్రిటన్‌లో కొన్న భవంతిని ప్రీమియర్ గోల్ఫ్, క్రీడలకు వేదికగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది.
రిలయన్స్ సంస్థ ఇంకా ఏమంది అంటే....
లండన్‌లోని స్టోక్ పార్క్‌లో నివాసం ఉండాలని అంబానీ ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్తా సంస్థలో స్టోరీ వచ్చింది. దీని ఆధారంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, ఆయన ఫ్యామిలీ లండన్ సహా ప్రపంచంలోని ఏ ప్రదేశానికి షిప్ట్ అవ్వాలని ఆలోచన చేయడం లేదు. అలాంటి ప్లాన్స్ లేవు. ఇటీవలే స్టోక్స్ పార్క్ ఎస్టేట్ కొన్న మాట వాస్తవమే. అన్ని నిబంధనలు పాటిస్తూ హెరిటేజ్ ప్రాపర్టీని కొనుగోలు చేశాం. దీన్ని ఓ ప్రీమియర్ గోల్ఫింగ్, స్పోర్టింగ్ రిసార్ట్‌గా చేసే లక్ష్యంతో దీన్ని కొన్నాం. ఈ భవనం మా సంస్థ ఎదుగుదలకు మరింత సహకరిస్తుందని ఆశిస్తున్నాం. అంతే కాకుండా భారతీయ ఆతిధ్యాన్ని ప్రపంచ దేశాలకు మరింతగా తెలిసేలా చేస్తుంది.
లండన్‌లోని బకింగ్‌హైంషైర్ వద్ద సుమారు 300 ఎకరాల్లో ఈ ప్యాలెస్ ఉంది. ప్రస్తుతం ముంబయిలోని యాంటిలియాలో ప్యాలెస్‌లో అంబానీ ఫ్యామిలీ నివాసం ఉంటోంది.
ALSO READ: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తు నుంచి తొలగించడంపై సమీర్ వాంఖడే ఏమన్నారంటే..!
ALSO READ: ఆఫ్ఘన్ పైనే భారం వేశాం.. సెమీస్‌కు ఆ దారి మాత్రమే!
ALSO READ: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి ధరలు ఇలా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి