search
×

Provident Funds: ప్రావిడెంట్‌ ఫండ్స్‌ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?

చాలా మందికి పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌కు తేడా తెలియదు! ప్రావిడెంట్‌ ఫండ్‌ మొత్తం నాలుగు రకాలుగా ఉంటుంది. వేర్వేరు ఖాతలకు వేర్వేరు వడ్డీ రేట్లు ఉంటాయి.

FOLLOW US: 

సురక్షితం కావడం ప్రభుత్వం గ్యారంటీగా ఉండటంతో ఎక్కువ మంది ప్రావిడెంట్‌ ఫండ్‌లో డబ్బులు దాచుకొనేందుకు ఇష్టపడతారు. బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్న తరుణంలో భవిష్య నిధిపై ఎక్కువ రాబడి వస్తోంది. వేర్వేరు పీఎఫ్‌లపై 7.1 నుంచి 8.5 శాతం వరకు వడ్డీని ఇస్తున్నారు. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌), జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌), వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (వీపీఎఫ్‌) అని మొత్తం నాలుగు రకాల భవిష్య నిధి ఖాతాలు ఉన్నాయి.

పీపీఎఫ్‌ (PPF)

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాను ఉద్యోగంతో సంబంధం లేకుండా ఎవరైనా తెరవొచ్చు. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటును అమలు చేస్తున్నారు. ఏడాదిలో పీపీఎఫ్‌ ఖాతాలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేసుకోవచ్చు. పీపీఎఫ్‌ 'ఈఈఈ' కేటగిరీలోకి వస్తుంది. అంటే వడ్డీ సహా జమచేసే మొత్తంపై ఎలాంటి ఆదాయ పన్ను వర్తించదు. పీపీఎఫ్‌  లాకిన్‌ పిరియడ్‌ 15 ఏళ్లు. అవసరం అనుకుంటే మరికొంత గడువు పెంచుకోవచ్చు.

ఈపీఎఫ్‌ (EPF)

ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా తెరిచేందుకు ఉద్యోగులు మాత్రమే అర్హులు. సంఘటిత, అసంఘటిత రంగంతో సంబంధం లేదు.  ప్రతి నెలా ఉద్యోగి తన మూల వేతనంలో 12 శాతం జమ చేయాలి. దీనికి తోడుగా యజమాని కూడా మరో 12 శాతం జమ చేస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం వడ్డీరేటు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని సేవింగ్స్‌ ఖాతాలతో పోలిస్తే ఈపీఎఫ్‌పైనే ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు. ఉద్యోగానికి వీడ్కోలు పలికాక ఈ ఖాతా మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత వచ్చే డబ్బుపై పన్నులేమీ ఉండవు.

వీపీఎఫ్‌ (VPF)

ఈపీఎఫ్‌కు అదనంగా మరికొంత డబ్బు దాచుకోవాలంటే వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ఉద్యోగులకు మాత్రమే ఇందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌లో దాచుకుంటున్న 12 శాతానికి అదనంగా మూలవేతనంలో ఎంతైనా చేసుకోవచ్చు. వడ్డీ రేటూ ఈపీఎఫ్‌కు ఉన్నట్టే ఉంటుంది. అంటే ప్రస్తుతం 8.5 శాతం అన్నమాట. వీపీఎఫ్‌ను ఒకసారి ఎంచుకుంటే కనీసం ఐదేళ్ల వరకు కొనసాగించాలి. మధ్యలో తీసేయడానికి వీల్లేదు.

జీపీఎఫ్‌ (GPF)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో డబ్బులు దాచుకోవచ్చు. మూల వేతనం నుంచి 12శాతం ఈపీఎఫ్‌ జమ చేసిన తర్వాత అదనంగా దాచుకోవాలంటే జీపీఎఫ్‌ తెరవొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అందరికీ ఇది వర్తించదు. కొన్ని పరిమితులు వర్తిస్తాయి. ఇక నిబంధనలు, సౌకర్యాలు అన్నీ ఈపీఎఫ్‌ తరహాలోనే ఉంటాయి.

Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్‌ తెచ్చిన ఐటీ శాఖ

Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి

Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!

Also Read: LIC Jeevan Labh Policy: నెలకు రూ.233 చెల్లిస్తే రూ.17 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Nov 2021 12:40 PM (IST) Tags: EPF ppf personal finance GPF VPF provident funds

సంబంధిత కథనాలు

Rakesh Jhunjhunwala Quotes: మార్కెట్లో కోట్లు గడించాలని ఉందా! RJ  'సక్సెస్‌ మంత్రాలు' ఇవే!

Rakesh Jhunjhunwala Quotes: మార్కెట్లో కోట్లు గడించాలని ఉందా! RJ 'సక్సెస్‌ మంత్రాలు' ఇవే!

Rakesh Jhunjhunwala: రూ.5000తో మొదలై రూ.40వేల కోట్లు ఆర్జించి! RJ ప్రస్థానం అనితర సాధ్యం!

Rakesh Jhunjhunwala: రూ.5000తో మొదలై రూ.40వేల కోట్లు ఆర్జించి! RJ ప్రస్థానం అనితర సాధ్యం!

Gold-Silver Price: నేడు బంగారం ధర షాక్! ఏకంగా 400 పైకి - ఇవాల్టి లేటెస్ట్ రేట్స్

Gold-Silver Price: నేడు బంగారం ధర షాక్! ఏకంగా 400 పైకి - ఇవాల్టి లేటెస్ట్ రేట్స్

NPS Balance Check: ఎన్‌పీఎస్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవాలా! సింపుల్‌గా 4 మార్గాలు!!

NPS Balance Check: ఎన్‌పీఎస్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవాలా! సింపుల్‌గా 4 మార్గాలు!!

Gold Price: బంగారం కొనేందుకు ఇదే బెస్ట్‌ టైమ్‌! నెల రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్‌!

Gold Price: బంగారం కొనేందుకు ఇదే బెస్ట్‌ టైమ్‌! నెల రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్‌!

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!