WhatsApp Ban: వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
WhatsApp: వాట్సాప్‌లో మనం కొన్ని యాక్టివిటీల్లో భాగం అయితే మీ అకౌంట్ బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ యాక్టివిటీలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Whatsapp Account Banned: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. కానీ ప్రతి నెలా లక్షలాది ఖాతాలు బ్యాన్ అవుతున్నాయి. అకౌంట్లు బ్యాన్ అవ్వడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాట్సాప్ తెలుపుతున్న దాని ప్రకారం ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే భారతదేశంలో 76 లక్షలకు పైగా ఖాతాలు క్లోజ్ అయ్యాయి. అటువంటి పరిస్థితిలో మీ ఖాతాను ఏ కారణాల వల్ల మూసేస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పొరపాటున మీ అకౌంట్ బ్యాన్ అయితే ఎలా రీస్టోర్ చేసుకోవాలో తెలుసుకోవడం అంత కంటే ముఖ్యం.
చాలా మంది వినియోగదారులు అధికారిక వాట్సాప్‌ను ఉపయోగించకుండా థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం WhatsApp Delta, GB WhatsApp, WhatsApp Plus వంటి పేర్లతో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ కంపెనీ ఈ యాప్‌ల వాడకాన్ని నిషేధిస్తుంది. మీరు ఈ థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగిస్తే మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది.
వేరే వారి పేరుతో వాడకూడదు...
మీరు వేరొకరి పేరు, ప్రొఫైల్ ఫోటో, గుర్తింపుతో మెసేజ్‌ను పంపినా కూడా కంపెనీ మీ వాట్సాప్ ఖాతాను నిషేధించవచ్చు. ఇలా చేయడాన్ని వాట్సాప్ కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనగా కూడా పరిగణిస్తారు. మీరు ఒక సెలబ్రిటీ, బ్రాండ్ లేదా సంస్థ పేరుతో నకిలీ ఖాతాను రన్ చేసినట్లయితే మీ ఖాతాను కూడా నిషేధించవచ్చు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్లకు మెసేజ్‌లు పంపడం
మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులకు మీరు రోజంతా మెసేజ్‌లు పంపుతుంటే వాటిని స్పామ్‌గా పరిగణించవచ్చు. అలాంటి సందర్భంలో మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది.
రిపోర్ట్ చేసినా క్లోజ్ చేస్తారు
చాలా మంది యూజర్లు మీ ఖాతాను రిపోర్ట్ చేసినట్లయితే కంపెనీ మీపై చర్య తీసుకోవచ్చు. అనంతరం మీ ఖాతాను మూసివేయవచ్చు కూడా. మిమ్మల్ని రిపోర్ట్ చేస్తున్న వ్యక్తి మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నాడా లేదా అనేది ఇక్కడ అవసరం లేదు.
మీరు ఎవరినైనా వేధించే లేదా బెదిరించే ఉద్దేశ్యంతో సందేశాలు పంపితే మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది. దీంతో పాటు రెచ్చగొట్టేలా, ద్వేషపూరిత లేదా అభ్యంతరకరమైన సందేశాలను పంపినందుకు కూడా మీపై చర్య తీసుకోవచ్చు. కాబట్టి వాట్సాప్‌లో మెసేజ్‌లు కానీ, ఫొటోలు కానీ, వీడియోలు కానీ పంపే ముందు అవి నియమాలకు తగ్గట్లు ఉన్నాయో లేవో చూసుకోవడం మంచిది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
This ruling is a huge win for privacy.
— Will Cathcart (@wcathcart) December 21, 2024
We spent five years presenting our case because we firmly believe that spyware companies could not hide behind immunity or avoid accountability for their unlawful actions.
Surveillance companies should be on notice that illegal spying will…





















