అన్వేషించండి

Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా

Cock Fight Events in Andhra Pradesh | ఏపీలో సంక్రాంతి అంటే ఆ మజానే వేరు. ముఖ్యంగా కోడి పందేలలో వేల రూపాయల నుంచి లక్షల్లో గానీ, ఖరీదైన వాహనాలను గానీ విజేతలకు ప్రకటిస్తున్నారు.

Cockfighting in AP | ఏపీలో సంక్రాంతి సందర్భంగా జోరుగా కోడి పందెలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తగ్గేదేలే అన్నట్లుగా కోడి పందెలు, వాటిపై భారీగా బెట్టింగ్స్ సైతం వేస్తున్నారు. కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి మహింద్రా థార్ ను సైతం గిఫ్ట్‌గా ప్రకటించారు నిర్వాహకులు. సంక్రాంతి (Sankranti 2025) సందర్భంగా ఏర్పాటు చేసిన కరప పందెం బరి గెలిచిన వారికి థార్ వాహనం గిఫ్ట్ అని జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. 

కోడి పందేల బరులకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామ

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వెళ్లి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరంలో కోడి పందాలను రఘురామ ప్రారంభించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించిన కోడి పందేల్లో కోళ్లకు కత్తులు లేకుండా  డింకీ పందెలు వేశారు. అయినా సరే తమ పుంజుదే విజయం అంటే, కాదు మాదే అంటూ కోడిపుంజుల ఓనర్లు మీసాలు మెలేస్తున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ జోరుగా పందేలు

అటు బెజవాడలోనూ కోడి పందెలలో తగ్గేదేలే అంటూ సాగిపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కోడి పందేల బరులు ఏర్పాటు చేసి నిర్వాహకులు పోటీలు జరిపిస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాలైన రామవరప్పాడు, గన్నవరం, నున్న, అంపాపురం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహణకు బరులు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వేల రూపాయల నుంచి లక్షల రూపాయలలో బెట్టింగ్స్ వేస్తున్నారు. బరుల్లో పందేల విజేతలకు బహుమతులు, క్యాష్ ప్రైజ్ పై ముందుగానే బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే కత్తులు కట్టి కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కోడి పందేలు చూసేందుకు సైతం గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో భారీ సంఖ్యలో ప్రజలు పందేలు చూసేందుకు వెళ్తున్నారు.

ఏపీలో ఉదయం పూట భోగి మంటలు వేసి తమ జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రజలు ఆకాంక్షించారు. ఓవైపు ఇళ్లల్లో రుచికరమైన పిండి వంటలు చేస్తుంటే, మరోవైపు కోడి పందేలు, గుండాట, జల్లికట్టు ఆటలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించడంతో ప్రజల్లోనూ వాటిని వీక్షించేందుకు ఆసక్తి పెరిగింది. 

చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు షురూ..

ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికొస్తే జల్లికట్టు పోటీలతో సందడి నెలకొంది. తమిళనాడు సరిహద్దు కావడంతో చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం అనుపల్లిలో, పాకాల మండలంలోని పలుచోట్ల నిర్వహిస్తున్న జల్లికట్టుకు విశేష స్పందన లభిస్తోంది. యువకులు ఎంతో ఉత్సాహంగా ఆ ఎద్దులను లొంగదీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎద్దులు దూసుకురావడంతో కొందరు యువకులు గాయపడ్డారు. ప్రతి ఏడాది ఈ ప్రాంతంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఇక్కడ జల్లికట్టు నిర్వహిస్తుంటారు.

Also Read: Atreyapuram Boat Racing: సంక్రాంతికి ఫుల్ జోష్ - కోనసీమలో కేరళ తరహా పడవ పోటీలు, ఆత్రేయపురానికి బోట్ రేసింగ్ శోభ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Vizag Trains: ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Peddi Movie Glimpse: రామ్ చరణ్ 'పెద్ది' నుంచి మరో అప్ డేట్ - గ్లింప్స్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది' నుంచి మరో అప్ డేట్ - గ్లింప్స్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
Embed widget