By: ABP Desam | Updated at : 03 Nov 2021 03:10 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఇన్‌కం టాక్స్
పన్నులకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకొనేలా పన్ను చెల్లింపు దారులకు సాయం చేసేందుకు ఆదాయపన్ను శాఖ సరికొత్తగా వార్షిక సమాచార పత్రం (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్) తీసుకొచ్చింది. వెబ్‌సైట్‌లో దీనిని విడుదల చేసింది. ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలిగే సౌకర్యం ఇందులో ఉంది.
ఏంటి ఈ ఏఐఎస్?
వార్షిక సమాచార పత్రాన్ని సులభంగా ఏఐఎస్ అంటున్నారు. వడ్డీ, డివిడెండ్, సెక్యూరిటీ లావాదేవాలు, మ్యూచువల్ ఫండ్ల లావాదేవీలు, విదేశాల నుంచి వచ్చిన ఆదాయం వివరాలను ఇందులో చూడొచ్చు. ఈ ఏఐఎస్ స్టేట్‌మెంట్లో సరళీకరించిన పన్ను చెల్లింపుదారు సమాచార సారాంశం (టాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ) సైతం ఉంటుంది. సులభంగా రిటర్నులు సమర్పించేందుకు టాక్స్‌పేయర్ మొత్తం విలువను తెలుసుకోవచ్చు.
ఫామ్26 కూడా అందుబాటులోనే
కొత్త ఏఐఎస్ స్టేట్‌మెంట్ పూర్తిగా అమల్లోకి వచ్చేవరకు ఫామ్26 ఏఎస్ కూడా TRACES పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. ఏఐఎస్‌లో ఫీడ్‌బ్యాక్ సబ్‌మిట్ చేయగానే రియల్‌టైమ్‌లో ఆటోమేటిక్‌గా టీఐఎస్ (సమ్మరీ) అప్‌డేట్ అవుతుంది. దీనిని ప్రీ ఫైలింగ్ రిటర్న్‌కూ ఉపయోగించుకోవచ్చు. ఇది దశల వారీగా అమల్లోకి వస్తుంది.
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
* మీ పాన్ లేదా ఆధార్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి ఈ ఫైలింగ్ పోర్టల్‌లో (https://eportal.incometax.gov.in/iec/foservices/#/login) లాగిన్ అవ్వాలి.
* టాప్‌మెనూలో సర్వీసెస్ సెక్షన్‌కు వెళ్లి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌ను క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. ఏఐఎస్ ట్యాబ్‌పై డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయాలి.
* పీడీఎఫ్ లేదా జేఎస్‌ఓఎన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఏఐఎస్ ఫామ్‌కు పాస్‌వర్డ్ ఉంటుంది. అది మీ పాన్, పుట్టినతేదీతో ఉంటుంది. ఉదాహరణకు మీ పాన్ ABCDE1234F, పుట్టినతేదీ 01-01-1978 అయితే మీ పాస్‌వర్డ్ ABCDE1234F01011978 అవుతుంది.
* పాస్‌వర్డ్ ఎంటర్ చేయగానే ఏఐఎస్ ఫామ్‌లోని వివరాలన్నీ కనిపిస్తాయి. మీ సమాచారంపై ఎలాంటి ఇబ్బందులు, అనుమానాలు ఉన్నా ఆన్‌లైన్‌లో వెంటనే ఫీడ్‌బ్యాక్
Income Tax Dept rolls out the new Annual Information Statement(AIS) on the Compliance Portal. It provides a comprehensive view of information to taxpayer, with facility to capture online feedback. Click on link 'AIS' under the 'Services' tab on https://t.co/GYvO3n9wMf to access. pic.twitter.com/Ub4EAgmkLq
— Income Tax India (@IncomeTaxIndia) November 1, 2021
Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి
Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!
Also Read: LIC Jeevan Labh Policy: నెలకు రూ.233 చెల్లిస్తే రూ.17 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే!
Also Read: Gold-Silver Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి కూడా అంతే.. నేటి ధరలివీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?