Gold-Silver Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి కూడా అంతే.. నేటి ధరలివీ..
22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.44,800 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,870 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నేడు పెరిగాయి. దంతేరాస్ రోజు స్థిరంగా ఉన్న ధరలు ఆ మరుసటి రోజే స్వల్పంగా పెరిగాయి. మరోవైపు, వెండి కిలోకు రూ.200 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.44,800 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,870 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.68,900గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర రూ.200 పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,800 గా స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,870గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,900గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,800 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,870గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,700 గా ఉంది.
Also Read: బ్రేకింగ్: కేర్ ఆస్పత్రిలో బాలకృష్ణకు సర్జరీ... డిశ్చార్జికి రెడీ
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,080గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,180గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉంది.
ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.41 పెరిగింది. హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,520 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.
Also Read: Maruti Celerio 2021: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి