By: ABP Desam | Updated at : 02 Nov 2021 05:50 PM (IST)
బాలకృష్ణ
ప్రముఖ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేర్ ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బావుందని, డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నారని కేర్ వర్గాలు వెల్లడించాయి. అసలు, బాలకృష్ణకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
నందమూరి బాలకృష్ణను ఆరు నెలలుగా కుడి భుజం ఇబ్బంది పెడుతోంది. కుడి చేయి పైకి ఎత్తలేకపోతున్నారని... కుడి చేతిని కదిలించడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన నొప్పి కలుగుతోందట. అందువల్ల, బంజారా హిల్స్ కేర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్టోబర్ 31న ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్టు తెలుస్తోంది. నాలుగు గంటల పాటు అనుభవజ్ఞులైన వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం బావుందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. డిశ్చార్జికి బాలకృష్ణ రెడీగా ఉన్నారని తెలిపారు. ఈ రోజు ఇంటికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరు వారాలు విశ్రాంతి తీసుకోమని బాలకృష్ణకు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.
సినిమాలకు వస్తే... 'సింహ', 'లెజెండ్' తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి నటించిన 'అఖండ' సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. టైటిల్ సాంగ్ ప్రోమోను దీపావళి కానుకగా 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఫుల్ సాంగ్ ఈ నెల 8న విడుదల కానుంది.
'అఖండ' తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బౌండ్ స్క్రిప్ట్ సిద్ధమైందని, ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని సమాచారం. సినిమాలు కాకుండా 'ఆహా' ఓటీటీ కోసం బాలకృష్ణ 'అన్ స్టాపబుల్స్' పేరుతో ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గెస్టులుగా వచ్చిన తొలి ఎపిసోడ్ ప్రోమో ఇటీవల విడుదలైంది.
Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!
Also Read: జై భీం సమీక్ష: సూర్య మళ్లీ కొట్టాడు.. ఈసారి అవార్డులు కూడా!
Also Read: మాస్ మహారాజా ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!
Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గమనించారా!?
Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?
Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!
సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ, పరశురాం మూవీ - టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'
తలపతి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ - 'లియో' ఆడియో లాంచ్ రద్దు, కారణం అదేనా?
Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ - నిర్మాత ఆఫర్
Muttiah Muralitharan : '800' దర్శకుడికి ఓ కండిషన్ పెట్టిన ముత్తయ్య మురళీధరన్
Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు
Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
/body>