By: ABP Desam | Updated at : 02 Nov 2021 01:00 PM (IST)
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఏం చేస్తున్నారు? 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. సోమవారం సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. మలయాళ హిట్ 'లూసిఫర్'కు రీమేక్ ఇది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. రెండు వారాల పాటు హైదరాబాద్‌లో చిరంజీవి సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత నుంచి 'భోళా శంకర్' సెట్స్ మీదకు చిరంజీవి వెళ్లనున్నారు.
అవును... చిరంజీవి రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నారు. ఓ సినిమా తర్వాత మరో సినిమా అని కాకుండా... ఓ సినిమా కొంత షూటింగ్ చేసి, ఆ తర్వాత షెడ్యూల్ గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. తమిళ హిట్ 'వేదాళం'కు 'భోళా శంకర్' రీమేక్. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేష్, చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా కనిపించనున్నారు.
ఇటు 'గాడ్ ఫాదర్'... అటు 'భోళా శంకర్'... రెండూ రీమేక్ సినిమాలే. తెలుగు ప్రజల అభిరుచికి తగ్గట్టు కథల్లో కొన్ని మార్పులు చేశారు. ఆల్రెడీ బౌండ్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. షెడ్యూల్స్ పక్కాగా ప్లాన్ చేస్తే... ఓ నెలలో కొన్ని రోజులు ఓ సినిమా, ఆ తర్వాత మరికొన్ని రోజులు మరో సినిమా షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ రెండిటికి ముందు చిరంజీవి 'ఆచార్య' సినిమా చేశారు. అది వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: సాయి పల్లవి కోరిక... కామెడీ చేస్తానంటోంది!
Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!
'ఆచార్య'లో రామ్ చరణ్ కీలక పాత్ర చేయగా... ఆయనకు జోడీగా పూజా హెగ్డే, చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమాలో 'నీలాంబరి' పాటను ఈ నెల 5న విడుదల చేయనున్నారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గమనించారా!?
Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?
Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!
Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?
Ram - Boyapati Movie : రామ్ - బోయపాటి శ్రీను సినిమాలో విలన్‌గా యంగ్ హీరో
Taraka Ratna Health - Balakrishna : తారకరత్నను కంటికి రెప్పలా కాపాడుతున్న బాలకృష్ణ - మృత్యుంజయ మంత్రంతో
Nayanthara: నన్నూ కమిట్మెంట్ అడిగారు, కాస్టింగ్ కౌచ్ పై నయనతార షాకింగ్ కామెంట్స్
Netflix: 2022లో అత్యధిక వ్యూస్ సాధించిన నెట్‌ఫ్లిక్స్ షో ఇవే - మీరూ చూడండి, బాగుంటాయ్!
TS Assembly : ప్రసంగంలో మార్పులు సూచించిన గవర్నర్ - వాస్తవ అంశాలే ఉంటాయన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి !
ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
KTR in Karimnagar: కేటీఆర్ కాన్వాయ్కి అడ్డుగా వెళ్లిన విద్యార్థులు, కరీంనగర్లో ఉద్రిక్తత
Economic Survey 2023: రైతులకు మోదీ సర్కార్ చేసిందేంటి! వ్యవసాయానికి మద్దతు ధరల పవర్!