Cocltail 2 Release Date : పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?
Cocktail 2 : పెళ్లి తర్వాత నేషనల్ క్రష్ రష్మిక ఫస్ట్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మేరకు ఆమె తన ఇన్ స్టాలో బిగ్ అప్డేట్ ఇస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Rashmika Mandanna's Cocktail 2 Release Date Locked : స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత నేషనల్ క్రష్ రష్మిక తన ఫస్ట్ మూవీ గురించి బిగ్ అప్డేట్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ మూవీ 'కాక్ టెయిల్ 2'లో ఆమె కీలక పాత్రలో నటించగా... రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
రిలీజ్ ఎప్పుడంటే?
'కాక్‌టెయిల్ 2' మూవీ వరల్డ్ వైడ్‌గా జూన్ 19న రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ ఈ నెల 18న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. పెళ్లి తర్వాత రిలీజ్ కానున్న రష్మిక ఫస్ట్ మూవీ ఇదే కానుంది. 2012లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్, డయానా, సైఫ్ అలీ ఖాన్ నటించిన రోమ్ కామ్ కాక్‌టెయిల్. హోమీ అదాజానియా దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా కాక్‌టెయిల్ 2 రానుంది.
View this post on Instagram
Also Read : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
హోమీ అదాజానియా దర్శకత్వంలోనే 'కాక్‌టెయిల్ 2' కూడా రానుంది. ఈ మూవీలో షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్, డింపుల్ కపాడియా, అర్జున్ రాంపాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న మూవీలో ఇదివరకూ ఎన్నడూ చూడని రోల్స్‌లో చూడబోతున్నట్లు తెలుస్తోంది.
రష్మిక, కృతి సనన్ లెస్బియన్ రోల్స్‌లో నటించనున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ మూవీస్‌లో ఈ పాయింట్ టచ్ చేయడం అప్పుడప్పుడూ సహజమే అయినా... ఇద్దరు స్టార్ హీరోయిన్ ఇలా నటిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ వార్తలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ట్రెండింగ్ వార్తలు






















