అన్వేషించండి

Ustaad Bhagat Singh Pre Release Event : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ - వేదిక ఎక్కడో తెలుసా?... పవన్ స్పీచ్‌పైనే అందరి ఫోకస్

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. భారీగా వచ్చే ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Pawan Kalyan's Ustaad Bhagat Singh Pre Release Event Details : పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్  చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కల్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీగా ఉండగా... ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

వెన్యూ ఎక్కడంటే?

 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 15న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ వేడుకకు పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర నటీనటులు, ప్రముఖులు హాజరు కానున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీగా రానున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా భారీ భద్రత కల్పించనున్నారు.

ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ హాజరు కానుండడంతో ఆయన స్పీచ్‌పైనే అందరి దృష్టి ఉంది. ఈవెంట్‌ను ఓ పండుగలా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా... ఆయన స్పీచ్‌తో ఫ్యాన్స్‌లో ఎలాంటి జోష్ నింపుతారో చూడాల్సి ఉంది.

Also Read : కపుల్ ఫ్రెండ్లీ To భర్త మహాశయులకు విజ్ఞప్తి - శుక్రవారం ఒకే రోజు ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్... ఫుల్ లిస్ట్ ఇదే 

వెయిటింగ్ ఫర్ ట్రైలర్

ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ టీజ్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... 'ఇది భగత్ గీత. దమ్మున్నోడు దాటొచ్చు' అంటూ పవన్ చెప్పే డైలాగ్ వేరే లెవల్. దీంతో ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పవన్ వింటేజ్ లుక్స్, సాంగ్స్ ఒక ఎత్తైతే ట్రైలర్ మరో ఎత్తు. పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్, పవనిజాన్ని చూపించే ఎలివేషన్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 14న అంటే శనివారం ట్రైలర్ రిలీజ్ కానుంది. దేఖ్ లేంగే సాలా సాంగ్ దగ్గర నుంచీ ఆరా ఆఫ్ ఉస్తాద్, కాలరే ఎత్తరా సాంగ్ వరకూ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

ఈ మూవీకి పవన్ ప్రాణం పెట్టి చేశారని... సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ మూవీకే హైలెట్ అని డైరెక్టర్ హరీష్ శంకర్ తాజా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పారు. పవన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని.. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చారు. ప్రతీ పవన్ అభిమాని కాలర్ ఎగరేసేలా మూవీ ఉంటుందని అన్నారు.

మూవీలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. తమిళ హీరో పార్తిబన్ విలన్ రోల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో మూవీని నిర్మించారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... థమన్ బీజీఎం స్కోర్ అందించారు. సెన్సార్ బోర్డు U/A  సర్టిఫికెట్ జారీ చేయగా... రన్ టైం 2:33:49 గంటలు ఉంటుందని తెలుస్తోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget