అన్వేషించండి

Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?

BRS: కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతగా కాకుండా జాగృతి నేతగా రాజకీయం చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్యపోరాటం నడుస్తోందన్న ప్రచారం ప్రారంభమయింది.

Kalvakuntla Kavitha is doing politics as a Jagruti leader instead of a BRS leader: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ బీసీ కమిషన్ ను కలిశారు. ఆమె పర్యటనలో ఎక్కడా బీఆర్ఎస్ నేతలు కనిపించలేదు. అలాగే బీఆర్ఎస్ కండువాలు కూడా. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె రాజకీయాలు చేస్తున్నారు. జాగృతిలో ఉన్న నేతలే ఆమె వెంట ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆమె చేస్తున్న పోరాటంపై బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది. ఇదొక్కటే కాదు.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని కూడా బీఆర్ఎస్ నేతలు లేకుండానే వెళ్లి పరామర్శించి వచ్చారు. 

బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా రాజకీయ కార్యక్రమాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయిన తర్వాత దాదాపుగా ఐదు నెలలకుపైగా జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అనారోగ్యం కారణంగా వైద్యం చేయించుకున్నారు. అయితే హఠాత్తుగా అదానీ ఇష్చూ బయటకు వచ్చిన వెంటనే స్పందించారు. అదానీతో పూర్తిగా కాంగ్రెస్ కు లింక్ పెట్టి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీని మోదీని విమర్శించడం లేదు. కానీ కవిత మాత్రం తన సైలెన్స్ ను బ్రేక్ చేసి మొదటి ట్వీట్ మోదీనే నిలదీశారు. అదానీపై ఆధారాలున్నా పట్టించుకోవడం లేదని తన లాంటి వారిని జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ సంచలనం అయింది. 

Also Read: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ

జాగృతి లీడర్లతో సమావేశాలు -యాక్టివ్ అవుతున్నానని సంకేతాలు

మరో వైపు ఒకప్పుడు తెలంగాణ జాగృతిగా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ తర్వాత భారత జాగృతిగా మారింది. ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదురు కావడంతో జాగృతి కార్యకలాపాలు కూడా  పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు తెలంగాణ జాగృతిగానే తన సంస్థను తెరపైకి తెచ్చి పాత నేతలందర్నీ పిలిచి మళ్లీ సమావేశం నిర్వహించారు. ఇక వరుసగా రాజకీయ పోరాటాలు చేయనున్నారు. అయితే అవి రాజకీయం అనే భావన రాకుండా వివిధ వర్గాల కోసం అన్నట్లుగా రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడా బీఆర్ఎస్ పాత్ర ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

Also Read: KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు

కవిత ఇలా సొంతంగా జాగృతి పేరుతో రాజకీయాలు చేయడంపై తెలంగాణ రాజకీయాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇదంతా వ్యూహాత్మకమేనని కొొన్ని వర్గాలు బావిస్తున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ పార్టీని నడిపిస్తున్నారు. కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్‌కు పరిమితయమ్యారు. ఆయన వచ్చే ఏడాది మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అప్పటికి మళ్లీ  కవిత బీఆర్ఎస్ నేతగా రాజకీయాలు చేస్తారని అంటున్నారు. అయితే కేటీఆర్ తో కవితకు విబేధాలు ఉన్నాయని.. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరాటం కారణంగానే కవిత తన సొంత రాజకీయాలు చేసుకుంటున్నారని అంటున్నారు. ఏది నిజమో భవిష్యత్ రాజకీయ పరిణామాలే స్పష్టం చేసే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget