![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
AP Schemes: ఏపీలో ఉద్యాన రైతులకు చేయూత అందించేలా ఫార్మ్ ఫండ్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.75 వేలు జమ చేస్తుంది.
![AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా! ap government farm fund scheme for farmers to give 75 thousand rupees application details AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/42c364f4d9848e2dbc487779487284e81732549589227876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Farm Fund Scheme Application Details: రైతులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యాన రైతులకు ఫార్మ్ ఫండ్ స్కీమ్ (Farm Fund Scheme) ద్వారా రూ.75 వేల సబ్సిడీ అందిస్తోంది. ఉద్యాన పంటలు పండించే రైతుల ఖాతాల్లో ఈ పథకం ద్వారా డబ్బులు జమ కానున్నాయి. కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగులో నీటి కొరత సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ఫార్మ్ ఫండ్ స్కీమ్ ప్రారంభించింది. నీటి లభ్యతను పెంపొందించడం, పంట దిగుబడిని మెరుగుపరచడం, నీటి నిల్వ కోసం ఫామ్ పాండ్‌లను సృష్టించే ఖర్చును సబ్సిడీ చేయడం ద్వారా రైతును ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో సర్కారు ఈ పథకం రూపొందించింది.
2 పంటలకు సరిపడా నీరు
ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఫామ్ పాండ్లను నిర్మిస్తుంది. 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు కొలతలతో పాండ్లను నిర్మిస్తారు. ఇందులో జియో మెంబ్రేన్ షీట్ (500 మైక్రాన్లు) ఉపయోగించి 12 లక్షల లీటర్ల వరకూ నీటి నిల్వ చేస్తారు. వేసవిలో 2 ఎకరాల్లో 2 పంటలకు సరిపడా నీటిని అందించగల సామర్ధ్యంతో వీటిని నిర్మిస్తారు. ఇది పండ్లు, పువ్వులు, కూరగాయల పంటల దిగుబడిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
50 శాతం సబ్సిడీ
చెరువు నిర్మాణానికి మొత్తం ఖర్చు రూ.1.50 లక్షలు కాగా.. రైతు తన వాటా కింద రూ.75 వేలు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రూ.75 వేలు అందిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు ల్యాండ్ టైటిల్, పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉంచుకోవాలి.
ఎలా అప్లై చేయాలంటే..!
- మీ సేవా కేంద్రాల్లో ఫార్మ్ ఫండ్ స్కీమ్ దరఖాస్తు ఫారంలు అందుబాటులో ఉంటాయి. అప్లికేషన్ పూర్తి చేసి ఆర్బీకేలో సమర్పించాలి.
- అధికారుల ధ్రువీకరణ తర్వాత చెరువులు తవ్వడం ప్రారంభించాలి. జియో - మెమ్‌బ్రేన్ షీట్ ఇన్‌స్టాల్ చేయాలి.
- దీన్ని అధికారులు ధ్రువీకరించిన అనంతరం రూ.75 వేల సబ్సిడీ నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు జమవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)