Aus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP Desam
ఆస్ట్రేలియా తో బోర్డర్ గావాస్కర్ ట్రోఫీని గ్రాండ్ గా ఆరంభించింది టీమిండియా. పెర్త్ టెస్టులో 295పరుగులతో ఘన విజయం సాధించింది. 534పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ మిడిల్ ఆర్డర్ పోరాటంతో కాస్త మెరుగైన స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. 3వికెట్ల నష్టానికి 12పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ ను సిరాజ్ ఆదిలోనే దెబ్బతీశాడు. ఉస్మాన్ ఖవాజా ను పెవిలియన్ కి పంపాడు. ఆ తర్వాత కుదురుకుంటున్న టైమ్ లో స్టీవ్ స్మిత్ సంగతి చూశాడు. దీంతో ఆస్ట్రేలియా 79పరుగులకే 5వికెట్లు కోల్పోయి..మరోసారి ఆసీస్ కుప్పకూలిపోతుంది అనుకున్నారు. కానీ ట్రేవియస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కేరీ పోరాడారు. హెడ్ 89పరుగులు, మిచ్ మార్ష్ 47పరుగులు, అలెక్స్ కెరీ 36పరుగులతో భారత విజయాన్ని రెండు సెషన్ల పాటు వాయిదా వేశారు. వరుస విరామాల్లో భారత బౌలర్లు సత్తా చాటడంతో 238పరుగులకు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. బుమ్రా,సిరాజ్ 3వికెట్లు, సుందర్ 2వికెట్లు, హర్షిత్ రానా, నితీశ్ రెడ్డి చెరోవికెట్ తీశారు. ఫలితంగా భారత్ 295పరుగుల విక్టరీతో పెర్త్ లో జెండా ఎగురేసి 5టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.