అన్వేషించండి

Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు

Tirupati News: చాలా రోజుల క్రితం ఓ బాలికపై దాడి జరిగితే అత్యాచారం జరిగిందని ప్రచారం చేసినందుకు వైసీపీ నేతలు ఇరుకున పడ్డారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ఇతరులపై పోక్సో కేసులు నమోదు అయ్యాయి.

Andhra Pradesh Crime News: వైసీపీ సీనియర్ లీడర్‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. బాలికపై అత్యాచారం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై దాడి జరిగింది. వెంటనే ఆమెపై అత్యాచారం జరిగిందని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రచారం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై బాలిక తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు తప్పుడు ప్రచారం చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరికొందరిపై కూడా పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. 

అసలేం జరిగింది?

తిరుపతికి సమీపంలోని ఎర్రావారిపాలెంలో స్కూల్‌కి వెళ్లి వచ్చే బాలిక ఒక రోజు ఇంటికి త్వరగా రాలేదు. కంగారు పడిన తల్లిదండ్రులు ఆమెను వెతికారు. ఆమె గాయాలతో ఊరికి సమీపంలోని ఓ ప్రాంతంలో పడి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేశారు. 

అత్యాచారం జరిగిందని దుష్ప్రచారం 

సోషల్‌మీడియాతోపాటు ప్రధాన మీడియా, వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని అప్పట్లోనే బాలిక తండ్రి, పోలీసులు ఖండించారు. వైద్య పరీక్షల్లో ఇంకా అత్యాచారం గురించి తేలకుండానే దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. స్నేహితుల మధ్య ఉన్న గొడవతోనే ఆమెను గాయపరిచారని... ఎలాంటి అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. 

బాలికను కలిసేందుకు విఫలయత్నం

బాలికపై దాడి జరిగిందని తెలుసుకున్న తిరుపతి ఎంపి డాక్టరు గురుమూర్తి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా, మాజీ ఎంఎల్‌ఏ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సహా వైసీపీ సీనియర్ నేతలంతా ఆసుపత్రిలో బాలికను పరామర్శించేందుకు ట్రై చేశారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి మిగతా వాళ్లంతా బాలికపై అత్యాచారం జరిగిందని అందుకే పోలీసులు తమను లోపలికి అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. బాలికతో మాట్లాడితే అసలు విషయాలు తెలుస్తాయని అన్నారు. 

Also Read: చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?

దుష్ప్రచారం వదన్న తండ్రి 

ఘటనపై అప్పట్లోనే స్పందించి జిల్లా ఎస్‌పి... బాధితురాలికి వైద్యపరీక్షలు చేశామని అత్యాచారం జరగలేదని చెప్పారు. కుటుంబ సభ్యులు సైతం ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. గాయాలతో పడి ఉన్న బాలికను చూసి ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే పోలీసులు వచ్చారని తమకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. అత్యాచారం జరగపోయినా అలాంటి ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయాలు ఉంటే వేరే విధంగా చూసుకోవాలే తప్ప ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేలా ఉండకూడదని అన్నారు. 

తమ బిడ్డపై అత్యాచారం జరగకపోయినా జరిగినట్టు ప్రచారం చేసే వారిపై ఎర్రవారిపాలెంలోనే కేసు పెట్టారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చెవిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. వారి వీడియోను పరిశీలిస్తున్నారు. 

Also Read: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Embed widget